Advertisement
Advertisement
Abn logo
Advertisement

15 పట్టణాల్లో మేఘా గ్యాస్‌ సరఫరా

  • అత్యధిక బిడ్లు గెలిచిన కంపెనీ 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో 15 పట్టణా ల్లో సిటీ గ్యాస్‌ పంపిణీ చేసే ప్రాజెక్టులు మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఎంఈఐఎల్‌)  చేతికి రానున్నాయి. పెట్రోలియం నేచురల్‌ గ్యాస్‌ నియంత్రణ మండలి 65 పట్టణాల్లో గ్యాస్‌ పంపిణీకి బిడ్లను ఆహ్వానించగా.. 61 పట్టణాలకు బిడ్లు దాఖలయ్యాయని, ఇందులో 15 పట్టణాలలో గ్యాస్‌ ను సరఫరా చేసేందుకు కంపెనీ ఎంపికైనట్లు మేఘా వెల్లడించింది. దాదాపు 25 శాతం పట్టణాలను దక్కించుకున్నట్లు తెలిపింది. సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ పట్టణాల్లో సిటీ గేట్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయడం.. గ్యాస్‌ సరఫరాకు పైపులైన్లు నిర్మించడం, తద్వారా ఇళ్లకు గ్యాస్‌ను సరఫరా చేయడం వంటి పనులు చేపడుతుంది. ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేయడానికి ఇప్పటికే తెలంగాణలోని నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ ప్రాంతాల్లో పైపు లైన్ల నిర్మాణం, సీఎన్‌జీ గ్యాస్‌ స్టేషన్లను మేఘా ఏర్పాటు చేస్తోంది. 

Advertisement
Advertisement