త్వరలో మాకు ఆడపిల్ల పుట్టబోతోంది.. ఓప్రా విన్‌ ఫ్రే షోలో రాజదంపతులు

ABN , First Publish Date - 2021-03-09T11:33:16+05:30 IST

బ్రిటన్‌ రాచదంపతులు ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మెర్కెల్‌ రాజకుటుంబపై సంచలన వ్యాఖ్యలు చేశా రు. రాజకుటుంబంలో తాను ఇమడలేకపోయానని.. గర్భిణిగా ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని మేఘన్‌ తెలిపారు.

త్వరలో మాకు ఆడపిల్ల పుట్టబోతోంది.. ఓప్రా విన్‌ ఫ్రే షోలో రాజదంపతులు

లాస్‌ఏంజెలె్‌స/లండన్‌, మార్చి 8: బ్రిటన్‌ రాజదంపతులు ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మెర్కెల్‌ రాజకుటుంబపై సంచలన వ్యాఖ్యలు చేశా రు. రాజకుటుంబంలో తాను ఇమడలేకపోయానని.. గర్భిణిగా ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని మేఘన్‌ తెలిపారు. ప్ర పంచ ప్రఖ్యాతి గాంచిన ఓప్రా విన్‌ ఫ్రే షోలో వారు పాల్గొన్నారు. 1995లో ప్రిన్స్‌ హ్యారీ తల్లి డయానా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వా త ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంటర్వ్యూ ఇది. ఈ ఇంటర్వ్యూలో వారు పలు సంచలన విషయాలు వెల్లడించా రు. అధికారికంగా వివాహం చేసుకోవడానికి 3 రోజుల ముందు తాము రహస్యంగా కాంటర్బరీ ఆర్చ్‌ బిషప్‌ సమక్షంలో వివాహం చేసుకున్నామని తెలిపారు. రాజకుటుంబంలోకి వెళ్లగానే తన పాస్‌ పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, తాళాలన్నింటినీ తీసేసుకున్నారని.. వాటిని తాను చూడ్డం అదే చివరిసారి అని మేఘన్‌ తెలిపారు. 


‘‘ఆ కట్టుబాట్ల ఒత్తిడిని నేను తట్టుకోలేకపోయాను. 5 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలొచ్చాయి. బయటకు వెళ్లాలనుకున్నాను. రాజకుటుంబంలోని వ్యక్తిని సంప్రదిస్తే బాగుండదన్నా రు’’ అని మేఘన్‌ వివరించారు. లాస్‌ఏంజెలి్‌సకు వెళ్లిపోదామన్న తన మాటను ఒప్పుకోవడం ద్వారా హ్యారీ ఎంతో మేలు చేసినట్టు వెల్లడించారు. అలాగే.. తాను తొలిసారి గర్భిణిగా ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డ ముదురు రంగులో(డార్క్‌) ఉండొచ్చని రాజకుటుంబానికి చెందిన వ్యక్తి ఒకరు అనుమానించినట్టు మేఘన్‌ తెలిపారు. ఆ వ్యక్తి ఎవరో చెప్తే రాజకుటుంబం ప్రతిష్ఠను మరింత దిగజారుస్తుందన్నా రు.


తమ కుమారుడు ఆర్చీ మిశ్రమ జాతి(మేఘన్‌ తల్లి ఆఫ్రికన్‌-అమెరికన్‌. కాబట్టి మేఘన్‌ కుమారుణ్ని కూడా మిశ్రమ జాతిగా పరిగణిస్తున్నారు) కాబట్టి అతడికి ప్రిన్స్‌ హోదా రాదని తెలిసి షాక్‌కు గురయ్యామని హ్యారీ దంపతులు వివరించారు. తాము బయటకు వెళ్లిపోయాక తండ్రికి ఫోన్‌ చేసినా మాట్లాడట్లేదని, తనకు ప్యాలెస్‌ నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా నిలిపివేశారని ప్రిన్స్‌ హ్యారీ ఆవేదన వెలిబుచ్చారు. తన తల్లి తనకు వదిలి వెళ్లినదాంతోనే ప్రస్తుతానికి జీవిస్తున్నామని.. బహుశా తన తల్లి దీన్ని ముందే ఊహించి ఉంటారని హ్యారీ పేర్కొన్నారు. ఇక.. త్వరలో తాను మరోసారి తల్లిని కాబోతున్నానని మేఘన్‌ చెప్పగా.. పుట్టబోయేది ఆడపిల్లని హ్యారీ చెప్పారు. ఇద్దరితో సరిపెడతామని కూడా స్పష్టం చేశారు.

Updated Date - 2021-03-09T11:33:16+05:30 IST