ప్రొద్దుటూరు వాసి మేఘనాథరెడ్డికి కలెక్టర్‌గా పదోన్నతి

ABN , First Publish Date - 2021-06-20T04:45:45+05:30 IST

ప్రొద్దుటూరు పట్టణానికి చెం దిన జి.మేఘనాఽథరెడ్డి తమిళనాడు కేడర్‌లో 2013లో ఐఏఎస్‌ కు ఎంపికై చెన్నై మున్పిపల్‌ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తూ, కలెక్టర్‌గా పదోన్నతి పొందారు.

ప్రొద్దుటూరు వాసి మేఘనాథరెడ్డికి     కలెక్టర్‌గా పదోన్నతి
కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మేఘనాథరెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, జూన్‌ 19 : ప్రొద్దుటూరు పట్టణానికి చెం దిన జి.మేఘనాఽథరెడ్డి తమిళనాడు కేడర్‌లో 2013లో ఐఏఎస్‌ కు ఎంపికై చెన్నై మున్పిపల్‌ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తూ, కలెక్టర్‌గా పదోన్నతి పొందారు.  ఆ విషయాన్ని ఆయన మామ అయిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది ఈవీ సుధాకర్‌రెడ్డి శనివారం తెలిపారు. మేఘనాఽథ రెడ్డి విద్యాభ్యాసం ప్రొద్దుటూరులోనే సాగిందని, విజయవాడలో డిగ్రీ, హైదరాబాదులోని సెంట్రల్‌ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో పీజీ పూర్తి చేశారని చెప్పారు. 2013 యూపీఎస్సీ పరీక్షలో 55వ ర్యాంకు సాధించి, తమిళనాడు కేడర్‌లో ఐఏఎ్‌సకు ఎంపికై తొలుత సేలం జిల్లా మెట్టురు సబ్‌ కలెక్టర్‌గా, ఆ తర్వాత జాయింట్‌ కమిషనర్‌ ల్యాండ్‌ రెవెన్యూ అధికారిగా, జాయింట్‌ కమిషనర్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌గా పనిచేస్తూ, ప్రస్తుతం చెన్నై మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తుండగా తమిళనాడు ప్రభుత్వం మేఘనాథరెడ్డికి కలెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ విరుధ్‌నగర్‌ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం విరుధ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారన్నారు. విష యం తెలుసుకున్న పలువురు పట్టణ ప్రముఖులు మేఘనాఽథరెడ్డికి ఫోన్‌ ద్వారా అభినందనలు తెలిపారు. 

Updated Date - 2021-06-20T04:45:45+05:30 IST