Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 2 2021 @ 17:09PM

పాకిస్థాన్ వెళ్ళండి : మోదీకి మెహబూబా ముఫ్తీ సలహా

శ్రీనగర్ : దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) సదస్సు పాకిస్థాన్‌లో జరిగితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవాలని జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆకాంక్షించారు. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం అమలు కోసం భారత్-పాక్ మధ్య కుదిరిన అవగాహన నేపథ్యంలో మోదీ సార్క్ సమావేశానికి హాజరైతే బాగుంటుందని చెప్పారు. కాల్పుల విరమణ వంటి విశ్వాసాన్ని పెంచే చర్యలు తప్పనిసరిగా రాజకీయ చర్చల ప్రక్రియకు దారి తీయాలని, ప్రశాంతత ఎక్కువ కాలం నిలవడంపై దృష్టి సారించాలని అన్నారు. మంగళవారం అనంత్‌నాగ్‌లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా స్పందించారు. 


ఈ ఏడాది సార్క్ సమావేశాలు ఏ దేశంలో నిర్వహిస్తారో ఇంకా ప్రకటించలేదు. భారత్-పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం, ఇతర అన్ని ఒప్పందాలు, అవగాహనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2021 ఫిబ్రవరి 24/25 అర్ధరాత్రి నుంచి నియంత్రణ రేఖ (ఎల్ఓసీ), ఇతర సెక్టర్లలో ఈ ఒప్పందాలన్నిటినీ అమలు చేయాలని నిర్ణయించాయి. ఇరు దేశాల మధ్య సానుకూల పరిణామాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మెహబూబా ముఫ్తీ సమాధానమిస్తూ, సార్క్ సమావేశాలు ఒకవేళ పాకిస్థాన్‌లో జరిగితే, కాల్పుల విరమణకు మంచి పర్యవసానంగా మోదీ ఆ సదస్సుకు హాజరైతే బాగుంటుందన్నారు. కాల్పుల విరమణ వంటి నమ్మకం కలిగించే చర్యలు శాశ్వతంగా నిలిచే శాంతిపై దృష్టిపెట్టే రాజకీయ ప్రక్రియకు దారి తీయాలని అన్నారు. 


Advertisement
Advertisement