Sep 28 2021 @ 15:41PM

Bhola shankar : మెహర్ రమేశ్ పారితోషికం ఆ రూపంగానా?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మలయాళ లూసిఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఊటీలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా కంప్లీట్ అయ్యాకా చిరు తమిళ ‘వేదాళం’ రీమేక్ వెర్షన్ ‘భోళా శంకర్’ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.  దాదాపు 8 ఏళ్ళ తర్వాత మెహర్ రమేశ్ ఈ సినిమాతో మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోనున్నారు. ఆయన ఆఖరుగా వెంకీ హీరోగా ‘షాడో’ సినిమా రూపొందించారు. 

హిట్స్ లేని మెహర్ ను చిరంజీవి పిలిచి మరీ ‘వేదాళం’ రీమేక్ అప్పగించారు.  తమిళ వెర్షన్ ను మెహర్ రమేశ్ తెలుగు నేటివిటీకి అనువుగా, మెగాస్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని స్ర్కిప్ట్ సమకూర్చగా.. చిరంజీవి దాన్ని మెరుగులు దిద్దించారట. అయితే ఈ సినిమా కోసం మెహర్ రమేశ్ ఒక్క రూపాయి కూడా పారితోషికంగా తీసుకోలేదట. ఈ సినిమా మొదలైనప్పటినుంచి కేవలం నెలజీతానికే పనిచేస్తున్నారట. నెలకి రూ. 5లక్షల జీతం చొప్పున ఆయన ఏడాది మొత్తంగా ఇప్పటి వరకూ రూ. 60 లక్షలు జీతంగా అందుకున్నారట. అలాగే.. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళి.. పూర్తయ్యే సరికి మరో సంవత్సరం టైమ్ పడుతుంది. ఈ సంవత్సరం లోనూ మరో రూ. 60 లక్షలు జీతంగా అందుకోనున్నారట. దాంతో పాటు సినిమా విడుదల య్యాకా 20శాతం వాటా కూడా తీసుకుంటారట. మొత్తంగా భోళాశంకర్ సినిమా కోసం మెహర్ రమేశ్ రూ. 2కోట్లు వరకూ పారితోషికంగా అందుకునే అవకాశముందని టాలీవుడ్ టాక్.