జాతివిద్వేషాన్ని పట్టించుకోకుండా వదలకూడదు: మెలిండా గేట్స్

ABN , First Publish Date - 2020-06-03T02:34:31+05:30 IST

అమెరికాలో కలకలం రేపిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై ప్రపంచ కుబేరుల్లో ఒకడైన బిల్‌గేట్స్ భార్య మెలిండా స్పందించారు.

జాతివిద్వేషాన్ని పట్టించుకోకుండా వదలకూడదు: మెలిండా గేట్స్

వాషింగ్టన్: అమెరికాలో కలకలం రేపిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై ప్రపంచ కుబేరుల్లో ఒకడైన బిల్‌గేట్స్ భార్య మెలిండా స్పందించారు. సోషల్ మీడియాలో ఊపందుకున్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ప్రచారానికి మద్దతు తెలిపారు. నల్లజాతీయులపై వివక్షను ప్రశ్నించకుండా, పట్టించుకోకుండా వదిలేయకూడదని ఆమె సూచించారు. ‘జార్జ్ ఫ్లాయిడ్ మృతి వీడియో చూసి నా గుండె బద్దలయింది. దీనిపై జరుగుతున్న నిరసనలు కూడా చూశా. వారందరికీ సంఘీభావం తెలుపుతున్నా’ అని ఆమె చెప్పారు. జాతి, లింగ సమానత్వం కోసం పోరాడే సంస్థలు, ప్రజలతో కలిసి తాను నడుస్తానని స్పష్టంచేశారు.

Updated Date - 2020-06-03T02:34:31+05:30 IST