అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం

ABN , First Publish Date - 2020-12-03T05:11:49+05:30 IST

అభివృద్ధి పనులకు రికార్డులు చేయడంలో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సర్వసభ్య సమా వేశంలో సభ్యు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయినపల్లి మండల పరిషత్‌ కార్యా లయంలో బుధవారం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌ అధ్యకతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ

బోయినపల్లి, డిసె ంబరు 2: అభివృద్ధి పనులకు రికార్డులు చేయడంలో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సర్వసభ్య సమా వేశంలో సభ్యు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయినపల్లి మండల పరిషత్‌ కార్యా లయంలో బుధవారం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌ అధ్యకతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. బోయినపల్లి ఎంపీ టీసీ సభ్యురాలు స్థంబ బుచ్చమ్మ లక్ష్మీరాజం మాట్లా డుతూ అధి కారుల తీరుతో బిల్లులు రావడం లేదన్నారు.  వెంకట్రా వుపల్లె సర్పంచ్‌ నందయ్య మాట్లాడుతూ తెలంగాణ సాగుకు ప్రోత్స హించిన ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లల్లో నిర్లక్ష్యం చేయడం తగద న్నారు. సన్నరకాలను సాగు చేయాలని గ్రామాల్లో రైతులకు అవ గాహన కల్పించామని, పంట చేతికి  అందాక కొనుగోళ్లు జరగక పోవడంతో  రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మండ లంలోని మానేరు వాగు నుంచి ఇసుక రవాణా అరికట్టాలని మా న్వాడ సర్పంచ్‌ రామిడి శ్రీను, ఎంపీటీసీ ఐరెడ్డి గీత కోరారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. జడ్పీటీసీ సభ్యురాలు ఉమాకొండయ్య, ఏఎంసీ చైర్మన్‌ కవ్వంపల్లి లక్ష్మీ రాములు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-03T05:11:49+05:30 IST