Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేడ్కర్‌ వర్ధంతిని అడ్డుకున్న యాదవులు

 దళితుల ధర్నా, రాస్తారోకో ...  ఆరుగురిపై అట్రాసిటీ కేసు 

అక్కన్నపేట, డిసెంబరు 6: అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామంలోని కట్కూర్‌ క్రాసింగ్‌ వద్ద సోమవారం అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమ ఏర్పాట్లను యాదవులు అడ్డుకున్నారు. అంబేడ్కర్‌ చిత్రపటాన్ని తీసి పక్కన పడేయడంతో దళితులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కాగా ఆ స్థలంలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నందున అక్కడ అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించవద్దని చెప్పి అడ్డుకున్నామని యాదవులు పేర్కొంటున్నారు.  ఈ స్థలంలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అందుకే అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించవద్దని చెప్పి అడ్డుకున్నామని యాదవులు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను సముదాయించారు. ఈ సంఘటనపై ఇదే గ్రామానికి చెందిన దళితుడు రాయికుంట రాజమౌళి తనతో పాటు మరికొంతమంది దళితులను కులం పేరుతో దూషించారని,అంబేడ్కర్‌ చిత్రపటాన్ని అవమానించి పక్కన పడేశారని పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురు వ్యక్తులు బంక మహేష్‌, బంక సాయిలు,బంక రాజవ్వ,ఎల్లడ కనకయ్య, మౌటం రజిని,సలేంద్ర చిన్న రాజయ్యలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కొత్తపల్లి రవి తెలిపారు. 

Advertisement
Advertisement