తృణధాన్యాల వాడకంతో వృద్ధుల్లో జ్ఞాపకశక్తి పెంపు

ABN , First Publish Date - 2020-02-20T09:46:53+05:30 IST

తృణధాన్యాల వాడకంతో వృద్ధుల్లో జ్ఞాపకశక్తి పెంపు

తృణధాన్యాల వాడకంతో  వృద్ధుల్లో జ్ఞాపకశక్తి పెంపు

లండన్‌, ఫిబ్రవరి 19 : వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గుముఖం పట్టడం సహజ ప్రక్రియే!! అయితే కూరగాయలు, తృణధాన్యాల వాడకంతో జ్ఞాపకశక్తి తగ్గే ప్రక్రియకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ(సిడ్నీ) శాస్త్రవేత్తలు అంటున్నారు. 1.39 లక్షల మంది వృద్ధులపై అధ్యయనం అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు వారు తెలిపారు. తృణధాన్యాల వాడకం పెంచితే ఆరు పదుల వయసులోనూ మతిమరుపు, హృద్రోగాలు, మధుమేహం, హైపర్‌ టెన్షన్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్నారు. బ్రిస్క్‌ వాక్‌, సైక్లింగ్‌, వాటర్‌ ఎరోబిక్స్‌ వంటి వ్యాయామాలతో వృద్ధుల్లో జ్ఞాపకశక్తి ఇనుమడిస్తుందని పేర్కొన్నారు. 

Updated Date - 2020-02-20T09:46:53+05:30 IST