హుషారుగా ఉంటే జ్ఞాపకశక్తి తగ్గదు!

ABN , First Publish Date - 2020-11-02T17:05:48+05:30 IST

వృద్ధాప్యంలో అడుగుపెట్టగానే చాలామందిలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడం చూస్తుంటాం. అయితే ఎప్పుడూ హుషారుగా

హుషారుగా ఉంటే జ్ఞాపకశక్తి తగ్గదు!

ఆంధ్రజ్యోతి(2-11-2020)

వృద్ధాప్యంలో అడుగుపెట్టగానే చాలామందిలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడం చూస్తుంటాం. అయితే ఎప్పుడూ హుషారుగా, చలాకీగా ఉండేవారు మలివయసులో జ్ఞాపకశక్తి కోల్పోయే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు అమెరికాలో ఇల్లినాయిస్‌లోని నార్త్‌వెస్ట్‌ యూనివర్సిటీ పరిశోధకులు. ‘సైకలాజికల్‌ సైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఏం చెబుతుందంటే.... ఎల్లప్పుడూ ఉత్సాహంగా, హుషారుగా పాజిటివ్‌ ఎఫెక్ట్‌తో ఉండేవారిలో వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి పరమైన సమస్యలు తక్కువట. పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా అమెరికాలో జాతీయ సర్వేలో మూడు పర్యాయాలు  మధ్యవయస్కులు, వృద్ధులైన 991 మందిని పరిశీలించారు. అధ్యయనంలో భాగంగా వారందరూ గత నెల రోజుల్లో తాము అనుభవించిన పాజిటివ్‌ ఎఫెక్ట్స్‌ను రిపోర్ట్‌ చేశారు.


చివరి రెండు విశ్లేషణల్లో వారికిజ్ఞాపకశక్తి సామర్థ్య పరీక్ష నిర్వహించారు. వారికి కొన్ని పదాలను చెప్పి, వాటిని వెంటనే, 15 నిమిషాల తరువాత చెప్పాలని అడిగారు. అదేసమయంలో పాజిటివ్‌ ఎఫెక్ట్‌, జ్ఞాపకశక్తి తగ్గడం, వయసు, లింగం, విద్య, ఆందోళన మధ్య సంబంధాన్ని అంచనా వేశారు. ‘‘జ్ఞాపకశక్తి వయసు పెరగడంతో తగ్గిపోవడం గుర్తించాం. ఎవరైతే ఎక్కువ హుషారుగా, పాజిటివ్‌ ఎఫెక్ట్‌తో ఉంటారో వారు జ్ఞాపకశక్తి కోల్పోవడం చాలా తక్కువ’’ అంటున్నారు క్లాడియా హాసే అనే పరిశోధకుడు.

Updated Date - 2020-11-02T17:05:48+05:30 IST