కమలా హారిస్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవీ..!

ABN , First Publish Date - 2020-08-13T06:35:29+05:30 IST

అమెరికా ఉపాధ్యక్ష పదవికి సెనెటర్ కమలా హారిస్‌ను ఎంపిక చేసినట్టు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ తాజాగా ప్రకటించిన విషయం తెలి

కమలా హారిస్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవీ..!

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష పదవికి సెనెటర్ కమలా హారిస్‌ను ఎంపిక చేసినట్టు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. జో బిడెన్ ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాలకే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దీనిపై స్పందించారు. కమలా హారిస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కమలా హారిస్ ఎంపిక తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. కమలా హారిస్.. ‘భయంకరమైన వ్యక్తి’ అంటూ విమర్శించిన ట్రంప్.. ‘అమెరికా సెనెట్‌లో ఆమె అంత అగౌరవనీయమైన వ్యక్తి మరొకరు లేరు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా జో బిడెన్.. ‘జాత్యహంకారాన్ని పోత్సహిస్తున్నారు’ అంటూ ఆరోపించారు. ‘ఒక మహిళను ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ప్రకటించి జో బిడెన్ తమను అవమానించాడని.. కొందరు పురుషులు భావిస్తుండొచ్చు’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా.. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అయ్యాయి. ఆయనపై వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 


Updated Date - 2020-08-13T06:35:29+05:30 IST