మెనోపాజ్‌ మరో మలుపా?

ABN , First Publish Date - 2021-10-26T08:42:46+05:30 IST

మెనోపాజ్‌లోకి అడుగు పెడితే లైంగిక జీవితం ముగిసినట్టే! మెనోపాజ్‌ పట్ల మహిళల్లో నెలకొని ఉన్న అపోహల్లో ఇదొకటి. నిజానికి మెనోపాజ్‌...

మెనోపాజ్‌  మరో మలుపా?

ఉమెన్స్‌ హెల్త్‌

మెనోపాజ్‌లోకి అడుగు పెడితే లైంగిక జీవితం ముగిసినట్టే! మెనోపాజ్‌ పట్ల మహిళల్లో నెలకొని ఉన్న అపోహల్లో ఇదొకటి. నిజానికి మెనోపాజ్‌... పునరుత్పత్తి జీవితానికి ముగింపు మాత్రమే! లైంగిక జీవితానికి కాదు. మెనోపాజ్‌ తర్వాత కూడా లైంగిక జీవితాన్ని సంపూర్తిగా ఆస్వాదించే వీలుంది. ఈస్ర్టోజెన్‌ హార్మోన్‌ తగ్గినంత మాత్రాన లైంగిక కోరికలు తగ్గుతాయి కానీ పూర్తిగా అడుగంటిపోవు. అయితే లైంగిక క్రీడకు ఉద్యుక్తులయ్యేందుకు పట్టే సమయం పెరగొచ్చు. అయితే ఈ విషయాలను అర్థం చేసుకోలేక మెనోపాజ్‌కు చేరుకున్న మహిళలు తమకు తాముగా సెక్స్‌లై్‌ఫకు దూరం పాటిస్తూ ఉంటారు. నిజానికి ఎంత తరచుగా సెక్స్‌లో పాల్గొంటే అంత ఎక్కువగా లైంగికారోగ్యం పుంజుకుంటుంది.


రెగ్యులర్‌గా సెక్స్‌లో పాల్గొంటే రోగనిరోధక శక్తి పెరగటంతోపాటు గుండెపోటు ప్రమాదం కూడా తప్పుతుంది. సెక్స్‌తో కటి కండరాలు బలపడతాయి. ఫలితంగా మూత్రాశయం బలం పుంజుకుని తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్‌ అయ్యే సమస్యలు తగ్గుతాయి. అలాగే అర్థరయిటిస్‌ కూడా తగ్గుముఖం పడుతుంది. మెనోపాజ్‌తో తలెత్తే డిప్రెషన్‌కు కూడా సెక్స్‌ చక్కని పరిష్కారం. క్రమం తప్పని సెక్స్‌తో దంపతుల మధ్య అనుబంధం బలపడుతుంది. కాబట్టి మెనోపాజ్‌లో పట్టు తప్పుతున్న శరీరాన్ని చూసుకుని కుంగిపోకుండా చక్కటి ఆహారం, వ్యాయామం, లైంగిక జీవితానికి చోటు కల్పిస్తే...జీవితం మెనోపాజ్‌కు ముందు, తర్వాతలుగా విడిపోకుండా ఉంటుంది. 

Updated Date - 2021-10-26T08:42:46+05:30 IST