మెనోపాజ్‌ సమస్యలు వీరిలో ఎక్కువ!

ABN , First Publish Date - 2020-12-14T20:17:23+05:30 IST

మహిళలు మెనోపాజ్‌ దశలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అయితే రోజూ కాసేపు వ్యాయామం చేయడం ద్వారా చాలా వరకు ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

మెనోపాజ్‌ సమస్యలు వీరిలో ఎక్కువ!

ఆంధ్రజ్యోతి(14-12-2020)

మహిళలు మెనోపాజ్‌ దశలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అయితే రోజూ కాసేపు వ్యాయామం చేయడం ద్వారా చాలా వరకు ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. శారీర వ్యాయామం చేయని మహిళల్లో మెనోపాజ్‌ సమయంలో వచ్చే ఇబ్బందులు ఎక్కువని తాజా అధ్యయనం చెబుతోంది. నార్త్‌ అమెరికన్‌ మెనోపాజ్‌ సొసైటీ జర్నల్‌లో వచ్చిన ఈ అధ్యయనం ఏం చెబుతోందంటే... మెనోపాజ్‌ దశలో ఉన్న 300మంది మహిళల్లో శారీరక వ్యాయామం, మెనోపాజ్‌ లక్షణాలను అధ్యయనం చేశారు. శారీరక వ్యాయామం మోస్తరుగా, ఎక్కువగా చేసే మహిళలతో పోల్చితే, వ్యాయామం తక్కువ చేసే మహిళల్లో మెనోపాజ్‌ లక్షణాలు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు.  

Updated Date - 2020-12-14T20:17:23+05:30 IST