ప్రతిరోజు బాదం పప్పు తినడం వల్ల ఆ సమస్య దరి చేరదు..

ABN , First Publish Date - 2021-11-16T20:56:30+05:30 IST

45 ఏళ్లు దాటిన మహిళలు ఆందోళనకు గురవుతూ ఉండే అంశం... మెనోపాజ్‌! ఈ దశ తప్పించుకోలేనిదే అయినా, హార్మోన్ల హెచ్చుతగ్గులతో శరీరంలో తలెత్తే అసౌకర్యాలను ఆహార మార్పులతో సరిదిద్దుకోగలిగే వీలుంది.

ప్రతిరోజు బాదం పప్పు తినడం వల్ల ఆ సమస్య దరి చేరదు..

ఆంధ్రజ్యోతి(16-11-2021)

45 ఏళ్లు దాటిన మహిళలు ఆందోళనకు గురవుతూ ఉండే అంశం... మెనోపాజ్‌! ఈ దశ తప్పించుకోలేనిదే అయినా, హార్మోన్ల హెచ్చుతగ్గులతో శరీరంలో తలెత్తే అసౌకర్యాలను ఆహార మార్పులతో సరిదిద్దుకోగలిగే వీలుంది. 


ఆకుకూరలు: ఆకుకూరలతో కూడిన ఆహారం, ఊబకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, పెద్ద వయసులో మొదలయ్యే మతిమరుపులను నియంత్రిస్తుంది. ఇందుకు తోడ్పడే విటమిన్లు, ఖనిజ లవణాలు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. 


చేపలు: వీటిలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, ప్రొటీన్లు కూడా ఉంటాయి. కాబట్టి మెనోపాజ్‌ దశలో కండరాలు క్షీణించకుండా ఉండాలంటే తరచూ చేపలు తినాలి.


సిట్రస్‌ పళ్లు: నారింజ, దబ్బ, నిమ్మ జాతి పళ్లు మెనోపాజ్‌ లక్షణాలైన వేడి ఆవిర్లు, చమటల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మధ్యవయసు ఒబేసిటీకి గురి కాకుండా రక్షణ కల్పిస్తాయి.


నట్స్‌: వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. ఆకలిని తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. ఐరన్‌, మెగ్నీషియం, సెలీనియం లాంటి కీలక పోషకాలుండే నట్స్‌ నడి వయసు మహిళల బరువును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా క్రమం తప్పకుండా బాదం పప్పు తినడం వల్ల నడుము చుట్టుకొలత పెరగకుండా ఉంటుంది.


అవకాడొ: ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు, పోషకాలు, ప్రొటీన్‌, పొటాషియం, బి విటమిన్‌ కలిగి ఉండే అవకాడొ మెనోపాజ్‌ మహిళలకు ఉత్తమమైన ఆహారం. కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లను తగ్గించే గుణం అవకాడొలకు ఉంటుంది.


Updated Date - 2021-11-16T20:56:30+05:30 IST