మానసిక ఆరోగ్యంను పాఠ్యాంశంగా చేర్చాలి

ABN , First Publish Date - 2021-01-18T05:53:36+05:30 IST

చిన్నచిన్న కారణాలతో ఆవేశంలో దేశంలో గంటకు ఒక్కరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, విద్యార్థులలో మానసికంగా ఎదగడానికి ఆత్మహత్యల నివారణ కోసం ప్రతీ తరగతిలో మానసిక ఆరోగ్యం గురించి పాఠ్యాంశంగా చేర్చాలని కోరుతూ జార్ఖాండ్‌లోని రాంచీకి చెందిన రోణిత్‌రాజన్‌ అన్నారు.

మానసిక ఆరోగ్యంను పాఠ్యాంశంగా చేర్చాలి
ఆదిలాబాద్‌లో రోణిత్‌కు స్వాగతం పలుకున్న యువజన సంఘాల నాయకులు

జిల్లాకు చేరుకున్న రాంచీ యువకుడు రోణిత్‌రాజన్‌ 

విద్యార్థుల ఆత్మహత్యల నివారణ కోసం కన్యాకుమారి నుంచి లడక్‌ వరకు పాదయాత్ర

ఇచ్చోడ రూరల్‌, జనవరి 17: చిన్నచిన్న కారణాలతో ఆవేశంలో దేశంలో గంటకు ఒక్కరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, విద్యార్థులలో మానసికంగా ఎదగడానికి ఆత్మహత్యల నివారణ కోసం ప్రతీ తరగతిలో మానసిక ఆరోగ్యం గురించి పాఠ్యాంశంగా చేర్చాలని కోరుతూ జార్ఖాండ్‌లోని రాంచీకి చెందిన రోణిత్‌రాజన్‌ అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణ కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌లోని లడక్‌ వరకు ఆయన చేపట్టిన పాదయాత్ర ఆదివారం జిల్లాకు చేరుకుంది. ఈ సం దర్భంగా ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. కాగా, రోణిత్‌కు ఇచ్చోడకు చెందిన వైద్యాధికారి కెంద్రేశంకర్‌రావ్‌ అతిథ్యం ఇచ్చారు. ఆ తర్వాత రోణిత్‌ మాట్లాడుతూ గత యేడాది నవంబరు 16న ప్రారంభించిన పాదయాత్ర మే నెలాఖరు వరకు లడక్‌కు చేరుకుంటానని ఆయన వివరించారు. 

జిల్లాకేంద్రంలో ఘన స్వాగతం 

ఆదిలాబాద్‌ టౌన్‌: రాంచీకి చెందిన యువకుడు రోణిత్‌రాజన్‌ చేపట్టిన పాదయాత్రకు జిల్లా యువజన సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. లడక్‌  నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన పాదయాత్ర ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరకుంది. ఇప్పటి వరకు 1500ల కి.మీల పాదయాత్ర కొనసాగించిన రోణిత్‌రాజన్‌ను యువజన సంఘాల నాయకులు అభినందించారు. 

Updated Date - 2021-01-18T05:53:36+05:30 IST