క్రీడలతో మానసిన ఉల్లాసం

ABN , First Publish Date - 2021-12-06T04:02:32+05:30 IST

క్రీడలు మానిసిక ఉల్లాసంతో పాటు శారీరక అభివృద్ధికి, జాతీయ సమైక్యతకు తోడ్పడతాయని తెలంగాణ వ్యా యామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నిరంజన్‌ పేర్కొన్నారు.

క్రీడలతో మానసిన ఉల్లాసం
జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలను ప్రారంభిస్తున్న దృశ్యం

నారాయణపేట, డిసెంబరు 5 : క్రీడలు మానిసిక ఉల్లాసంతో పాటు శారీరక అభివృద్ధికి, జాతీయ సమైక్యతకు తోడ్పడతాయని తెలంగాణ వ్యా యామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నిరంజన్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు జరగ్గా ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచ క్రీడాకారులకు గుర్తింపు ఉంటుందని అందుకు సచిన్‌ టెండూల్కర్‌ ఉదాహరణ అన్నారు. దేశంలోని అత్యున్నత పురస్కారం భారత రత్న ఒక క్రీడాకారుడికి దక్కిందన్నారు. జిల్లాలోని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని విజయాలు నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో క్రీడాకారుల అభివృద్ధికి సంఘం సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో అథ్లెటిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరసింహులు, రమణ, రాష్ట్ర వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మొగులాల్‌, టీ పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రమాకాంత్‌, శిక్షకులు సురేష్‌, జగదీశ్‌, పర్వీన్‌ బేగం, విద్యాసాగర్‌  పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T04:02:32+05:30 IST