మానసిక సమస్యలకు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-04-04T13:33:50+05:30 IST

మానసిక సమస్యలకు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌

మానసిక సమస్యలకు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌

ఏయూ క్యాంపస్‌ (విశాఖపట్నం): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని, వారికి ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చి పరిష్కార మార్గాలు చూపుతామని ఆంధ్ర విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎంవీఆర్‌ రాజు తెలిపారు. తనతోపాటు దేశవ్యాప్తంగా 26 మంది సైకాలజిస్టులు ఉదయం 9నుంచి రాత్రి 9గంటల వరకు, అత్యవసరమైతే 24 గంటలూ అందుబాటులో ఉంటామని, తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకోసం 9393101813, 9948087331, 9439282343, 9666674944, 9246993099 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Updated Date - 2020-04-04T13:33:50+05:30 IST