భవిత కేంద్రాల్లో దివ్యాంగుల దినోత్సవం

ABN , First Publish Date - 2021-12-04T04:55:46+05:30 IST

స్థానిక భవిత స్కూల్‌లో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఆటలపోటీలు జరిపారు.

భవిత కేంద్రాల్లో దివ్యాంగుల దినోత్సవం
అధికారులు అందించిన వీల్‌ఛైర్‌లో విద్యార్థిని మేఘన


ఫోటో : 3 ఎస్‌పేట 2 : భవిత స్కూల్‌లో విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేస్తున్న ఆచార్య భరద్వాజా సేవాసంస్థ నిర్వాహకులు, ఎంఈవో 


సూళ్లూరుపేట, డిసెంబరు 3 :  స్థానిక భవిత స్కూల్‌లో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఆటలపోటీలు జరిపారు. ఎం. ఫకీర్‌ - నాగమణి దంపతుల సహకారంతో ఆచార్యభరద్వాజా సేవాసంస్థబహుమతులు  సమకూర్చింది. ఎంఈవో మస్తానయ్య  విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. ఆచార్యభరద్వాజా సేవాసంస్థ నిర్వాహకులు ఎం.ఎం. చంద్రబాబు, అలవల భాస్కర్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శ్రీహరి, బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎం ధనలక్ష్మి పాల్గొన్నారు. భవిత పాఠశాల ఉపాధ్యాయిని భార్గవి కృతజ్ఞతలు తెలిపారు. 

విద్యార్థులకు న్యాయమూర్తి పండ్లు పంపిణీ

స్థానిక న్యాయమూర్తి ఫైజున్నీసా భవిత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. పాఠశాలను చక్కగా నిర్వహిస్తున్నారని ఉపాధ్యాయిని భార్గవిని అభినందించారు.

నాయుడుపేట టౌన్‌ : పట్టణంలోని మండల భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా  పెసల గుర్రప్పశెట్టి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మాలతి మాట్లాడుతూ భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించడం సంతోషకరమన్నారు. అనంతరం విద్యార్థి మేఘనకు వీల్‌చైర్‌ను అందించారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొరస్వామి, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం పుష్పలత,  ఉపాధ్యాయులు గోపీకిరణ్‌, ఎంఈవో కార్యాలయ సిబ్బంది సరిత, శ్రీధర్‌, భవ్యకేంద్ర నిర్వాహకులు సుబ్రహ్మణ్యం, నిర్మల పాల్గొన్నారు. 

ఓజిలి : స్థానిక భవిత కేంద్రంలో శుక్రవారం దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. మండల విద్యాశాఖ అధికారి జి. శైలజ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తలిదండ్రులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలం బూదనం టోల్‌ ప్లాజా యాజమాన్యం దాతృత్వంతో ఈ ట్రై సైకిళ్లతోపాటు రోలర్‌లను కూడా పంపిణీ చేశామని ఎంఈవో శైలజ తెలిపారు.

తడ :  స్థానిక భవిత కేంద్రంలో అంతర్జాతీయ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈవో భాబు  స్వర్ణటోల్‌ప్లాజా సమకూర్చిన వీల్‌చైర్‌లు, విడికిడి యంత్రాలను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాలల ప్రఽధానోపాధ్యాయులు మల్లికార్జున్‌రావు, నరసింహరావు, వెంకటేశ్వర్లు, కల్పన, సీఆర్‌పీలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-04T04:55:46+05:30 IST