మధ్యాహ్న భోజన పథకం మెనూ యథావిధిగా కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-01-25T06:30:59+05:30 IST

మధ్యాహ్న భోజన పథకం మెనూ యథావిధిగా కొనసాగించాలి

మధ్యాహ్న భోజన పథకం  మెనూ యథావిధిగా కొనసాగించాలి
వినతిపత్రం అందజేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు

గన్నవరం, జనవరి 24 : ప్రభుత్వం ఇటీవల మధ్యాహ్న భోజన పథ కంలో మెనూ మార్చటం సరికాదని యథావిధిగా కొనసాగించాలని కోరు తూ ఆ పథకం కార్మికులు సోమవారం స్థానిక మానవ వనరుల కేంద్రంలో వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు మెనూలో ప్రతి గురువారం పెట్టే కిచిడి బదులుగా ఇడ్లీ, సాంబారు అమలు చేయాలనే ఆలోచన విరమించు కోవాలని కోరారు. అమలు చేయాలంటే వంట పాత్రలు,  పొయ్యిలు, గ్యాస్‌, అదనపు కార్మికులు మెనూ చార్జి ఒక్కొక్కరికీ కనీసంగా రూ.50 అమలు చేయవలసి ఉందన్నారు. పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలన్నారు. ప్రభుత్వం గ్యాస్‌ను ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం అధ్యక్షురాలు పి.కుమారి, ప్రధాన కార్యదర్శి జి.సమ్మక్క, ఉపాధ్యక్షురాలు లలితకుమారి, సీఐటీయూ మండల కార్యదర్శి పిల్లి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-25T06:30:59+05:30 IST