వ్యాపారులు మాస్కులు ధరించాలి

ABN , First Publish Date - 2021-04-11T07:06:41+05:30 IST

ప్రతీ వ్యాపారి విధిగా మాస్కులు ధరించి తమ లావాదేవీలను నిర్వహించుకోవాలని సీఐ నైలునాయక్‌, ఎంపీడీవో రాధ ఆదేశించారు. శనివారం పట్టణంలోని పలు వ్యాపార సంస్థలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాస్కు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి జరిమానాలు విధించారు. అం

వ్యాపారులు మాస్కులు ధరించాలి
నేరడిగొండలో అవగాహన కల్పిస్తున్న పోలీసులు

భోథ్‌, ఏప్రిల్‌ 10: ప్రతీ వ్యాపారి విధిగా మాస్కులు ధరించి తమ లావాదేవీలను నిర్వహించుకోవాలని సీఐ నైలునాయక్‌, ఎంపీడీవో రాధ ఆదేశించారు. శనివారం పట్టణంలోని పలు వ్యాపార సంస్థలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాస్కు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి జరిమానాలు విధించారు. అంతేకాక మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న ఇరువురికి వెయ్యి చొప్పున జరిమానాలు విధించారు.  

నార్నూర్‌: కరోన సెకండ్‌ వేవ్‌ విస్తరిస్తునన నేపథ్యంలో ప్రతీ ఒక్కరు మాస్కులు తప్పకుండా ధరించాలని, లేదంటే జరినామా తప్పదని తహసీల్దార్‌ లక్ష్మణ్‌ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, ఎంపీడీవో రమేష్‌, ఎస్సై విజయ్‌కుమార్‌, ఎంపీవో స్వప్నశీల, ఏపీవో శేషారావు జాదవ్‌ ఉన్నారు. 

తలమడుగు: ప్రతీఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని లేని పక్షంలో జరిమానా విధించడం జరుగుతుందని ఆర్‌ఐ రోహిదాస్‌ కోరారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మండల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో భాగంగా ఆర్‌ఐ మండలంలోని ఆయా గ్రామాల్లో అవగాహన కల్పించారు. 

తలమడుగు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పై ఆందోళ న చెందకుండా కట్టడి చేసేందుకు ప్రతీఒక్కరు సహకరించాలని ఎంపీపీ కళ్యాణం లక్ష్మి కోరారు. శనివారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్‌ను మొదటి డోసు వేయించుకున్నారు. అనంతరం మండలంలోని రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్‌, పంచాయతీ కార్మికులు, ఇతర సిబ్బంది కరోనా టీకాను వేయంచుకున్నారు. 

నేరడిగొండ: రాష్ట్రంలో కరోనా రెండో దశ వేగంగా విస్తరిస్తోందని ప్రతీఒక్కరు కరోనా నిబందనలను పాటించాలని ఎస్సై భరత్‌ సుమన్‌ అన్నారు. శనివారం మండల కేంద్రలో ప్రజలకు నరోనా నిబందనలపై ఆవగాహన కల్పించారు. ఈసందర్బంగా అయన మాట్లాడారు. 

బోథ్‌ రూరల్‌: మండలంలోని కౌఠ(బి)గ్రామంలో శనివారం నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వలంటీర్‌ వెండి సోమేశ్వర్‌ మాట్లాడుతూ 45ఏళ్లు దాటిన ప్రతీఒక్కరు విధిగా వ్యాక్సిన్‌ వేయించుకో వాలని సూచించారు. ఇందులో ఎన్‌వైకే జిల్లా రిసోర్స్‌ పర్సన్‌ గొడిసెల రమణ గౌడ్‌, సమకార సంఘం డైరక్టర్‌ నిరంజన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T07:06:41+05:30 IST