Advertisement
Advertisement
Abn logo
Advertisement

విలీన మండలాల సమస్యలపై కలెక్టర్‌కు వినతి

వేలేరుపాడు, డిసెంబరు 6: వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు 2014లో రాష్ట్రంలో విలీనమైన నాటి నుంచి అభివృద్ధి పూర్తిగా నిలిపివేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి ఎస్‌కే గౌస్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం వినతిపత్రాన్ని అందిం చారు. విద్య, ఉద్యోగాలు, రోడ్ల అభివృద్ది, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం, ఇన్‌పుట్‌ సబ్సిడీ, బ్యాంక్‌ రుణాల మాఫీ, కొత్త రుణాల మంజూరును నిలిపి వేశారన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదంతో పెదవాగు ప్రాజెక్ట్‌ నిర్వహణ పనులను నిలిపివేశారన్నారు. దశబ్దాల నుంచి గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు ముత్యాలరావు, వీరాస్వామి, ఎంపీటీసీలు సోయం చంద్రరావు, తమ్మయ్య, సర్పంచ్‌లు రాంబాబు, మడివి రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement