ఎల్‌వీబీ ఇక డీబీఐఎల్

ABN , First Publish Date - 2020-11-26T08:00:45+05:30 IST

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ)ను డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా లిమిటెడ్‌ (డీబీఐఎల్‌)లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు, ఎల్‌వీబీ డిపాజిటర్ల నగదు ఉపసంహరణపైనా ఇక

ఎల్‌వీబీ ఇక డీబీఐఎల్

రెండు బ్యాంక్‌ల విలీనం  రేపటి నుంచే అమల్లోకి జూ కేంద్ర కేబినెట్‌ ఆమోదం

డిపాజిటర్ల నగదు విత్‌డ్రా  లావాదేవీలపై ఆంక్షల ఎత్తివేత 


న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ)ను డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా లిమిటెడ్‌ (డీబీఐఎల్‌)లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు, ఎల్‌వీబీ డిపాజిటర్ల నగదు ఉపసంహరణపైనా ఇక ఆంక్షలుండవని ఆయన స్పష్టం చేశారు. ఎల్‌వీబీలో డిపాజిటర్లు జమ చేసిన రూ.20,000 కోట్ల సొమ్ము పూర్తి భద్రమని, డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. డీబీఐఎల్‌లో విలీనం ఎల్‌వీబీకి చెందిన 20 లక్షల మంది డిపాజిటర్ల సొమ్ముతోపాటు 4,000 మంది సిబ్బంది ఉద్యోగాలకు భద్రత కల్పిస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.


చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎల్‌వీబీపై డిసెంబరు 16 వరకు మారటోరియం (బ్యాంక్‌ డిపాజిటర్లకు చెల్లింపులపై తాత్కాలిక నిలుపుదల) విధిస్తున్నట్లు ఈ నెల 17న కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టంలోని సెక్షన్‌ 45 ప్రకారం ఆర్‌బీఐ సమర్పించిన అప్లికేషన్‌ ఆధారంగా ఆర్థిక శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఈ మారటోరియంలో భాగంగా బ్యాంక్‌ డిపాజిటర్లు తమ ఖాతా నుంచి నెల రోజుల్లో ఉపసంహరించుకోగలిగే నగదు పరిమితిని రూ.25,000కు కుదించింది. అదేరోజు ఆర్‌బీఐ.. ఎల్‌వీబీ బోర్డును 30 రోజుల పాటు తన ఆధీనంలోకి తీసుకుంది. కెనరా బ్యాంక్‌ మాజీ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ టీఎన్‌ మనోహరన్‌ను బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. అంతేకాదు, ఎల్‌వీబీని డీబీఐఎల్‌లో విలీనం చేసేందుకు ఆర్‌బీఐ.. విలీన పథ కం ముసాయిదా ప్రకటించింది. కాగా ఈ నెల 27 (శుక్రవారం) నుంచే ఎల్‌వీబీ-డీబీఐఎల్‌ విలీనం అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ ప్రకటించింది. ఎల్‌వీబీ డిపాజిటర్ల నగదు ఉపసంహరణపై ప్రస్తుత ఆంక్షలు అదే రోజున రద్దవుతాయని తెలిపింది. విలీనం అమల్లోకి వచ్చాక ఎల్‌వీబీ శాఖలన్నీ డీబీఐఎల్‌ బ్రాంచీలుగా కార్యకలాపాలు కొనసాగిస్తాయమని ఆర్‌బీఐ పేర్కొంది. ఎల్‌వీబీ డిపాజిటర్లు ఆ రోజు నుంచి డీబీఎస్‌ ఖాతాదారులుగా తమ అకౌంట్లను నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. 


ఎల్‌వీబీ షేరు 5 శాతం అప్‌ 

ఈ వారంలో భారీగా పతనమవుతూ వచ్చిన లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ షేరు.. బుధవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో దాదాపు 5 శాతం బలపడింది. బీఎ్‌సఈ ప్రారంభ ట్రేడింగ్‌లో 4.79 శాతం నష్టపోయిన షేరు  ఏడాది కనిష్ఠానికి పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా కోలుకున్న ఎల్‌వీబీ షేరు చివరికి 4.79 శాతం లాభంతో అప్పర్‌ సర్క్యూట్‌ పరిమితి రూ.7.65 వద్ద ముగిసింది. 


ఎన్‌ఐఐఎఫ్‌ డెట్‌ ప్లాట్‌ఫామ్‌కు రూ.6,000 కోట్లు 

నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌) స్పాన్సర్‌ చేస్తున్న ఎన్‌ఐఐఎఫ్‌ డెట్‌ ప్లాట్‌ఫామ్‌కు రూ.6,000 కోట్లు సమకూర్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ 3.0లో భాగంగా ఈ ప్లాట్‌ఫామ్‌కు ఈక్విటీ నిధులు సమకూర్చనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రకటించారు. 

Updated Date - 2020-11-26T08:00:45+05:30 IST