మెస్సీ X నేమార్‌

ABN , First Publish Date - 2021-07-10T07:55:41+05:30 IST

కోపా అమెరికా ఫైనల్లో అర్జెంటీనా-బ్రెజిల్‌ తలపడితే చూడాలనేది అభిమానుల కల.

మెస్సీ X నేమార్‌

అర్జెంటీనాతో బ్రెజిల్‌ ఢీ

కోపా కప్‌ ఫైనల్‌ రేపే ఆదివారం 

ఉదయం 5.30  సోనీ సిక్స్‌, 

సోనీ టెన్‌లో..

బ్రెజిల్‌ ఫైనల్‌కు చేరారిలా 

అర్జెంటీనా క్వార్టర్స్‌లో చిలీపై 1-0తో

సెమీస్‌లో పెరూపై 1-0తో

 క్వార్టర్స్‌లో ఈక్వెడార్‌పై 3-0తో

సెమీ్‌సలో కొలంబియాపై 

1-1 (3-2) పెనాల్టీ ద్వారా

 కోపా అమెరికా కప్‌ ఫైనల్లో అర్జెంటీనా-బ్రెజిల్‌ గతంలో మూడుసార్లు తలపడ్డాయి. 1937లో అర్జెంటీనా, 2004, 2007లో బ్రెజిల్‌ గెలిచింది.


రియో డి జెనీరో: కోపా అమెరికా ఫైనల్లో అర్జెంటీనా-బ్రెజిల్‌ తలపడితే చూడాలనేది అభిమానుల కల. ఓవైపు మెస్సీ, మరోవైపు నేమార్‌ ఈ ఇద్దరు సూపర్‌స్టార్లు ప్రత్యర్థులుగా తమ అద్భుత విన్యాసాలను ప్రదర్శిస్తుంటే చూసేందుకు రెండు కళ్లు సరిపోవేమో.. అత్యంత శక్తిమంతమైన ఈ రెండు జట్ల మధ్య అద్భుత మ్యాచ్‌ను చూసేందుకు మరొక్క రోజు ఆగితే చాలు. మెస్సీ కెరీర్‌లో ఒక్క అంతర్జాతీయ ట్రోఫీ కూడా లేదు. అందుకే శక్తినంతా ధారపోసి కప్‌ను సాధించాలనే కసితో ఉన్నాడు. డిఫెండింగ్‌ చాంప్‌ హోదాలో బ్రెజిల్‌ టైటిల్‌ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది.


బలం: నేమార్‌ అటాకింగ్‌పై ఎక్కువ ఆధారపడి ఉంది. కొత్త ఆటగాడు లూకాస్‌ పోకెటా సెమీ్‌సలో పెరూపై అదరగొట్టాడు. డిఫెన్స్‌లో కెప్టెన్‌ సిల్వ, మర్కిన్హోస్‌ అడ్డుగోడలా ఉంటారు. ఇక రిజర్వ్‌ బెంచ్‌ కూడా బలంగా కనిపిస్తోంది. 

బలహీనత: జట్టు నేమార్‌పైనే ఎక్కువగా ఆధారపడడం ఒక్కోసారి దెబ్బతీస్తోంది. అలాగే రికార్లిసన్‌, ఫ్రెడ్‌, పకేటాలకు పెద్ద టోర్నీల్లో ఆడిన అనుభవం ఎక్కువగా లేదు.

అవకాశం: మరకానా స్టేడియంలో ప్రేక్షకులకు అనుమతి లేకపోయినా సొంతగడ్డపై ఆడనుండడం బ్రెజిల్‌కు సానుకూలాంశం.

ప్రమాదం: జీస్‌సపై సస్పెన్షన్‌ జట్టు ఫ్రంట్‌లైన్‌పై ప్రభావం చూపవచ్చు. ప్రత్యర్థికి ఫ్రీ కిక్‌ అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. లేకుంటే మెస్సీ వీరిని దెబ్బతీయొచ్చు.

బలం: లియోనల్‌ మెస్సీ నాలుగు గోల్స్‌తో ఇప్పటికే సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. అలాగే అతడి ఫ్రీ కిక్‌ సామర్థ్యం మరో ఆకర్షణ కానుంది. ఇక ప్రశాంతంగా కనిపించే గోల్‌ కీపర్‌ ఎమిలియానో మార్టినెజ్‌ పెట్టని గోడలా నిలబడనున్నాడు. 

బలహీనత: మిడ్‌ఫీల్డ్‌లో కాస్త బలహీనంగా కనిపిస్తోంది. దీంతో మెస్సీపై అతిగా ఆధారపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా జట్టులోని డిఫెన్స్‌ లోపాలను నేమార్‌, డానిలో, లోడీ వినియోగించుకుంటే ప్రమాదమే.

అవకాశం: 28 ఏళ్ల తర్వాత మరో కోపాను గెలుచుకునేందుకు... అలాగే మెస్సీ కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టోర్నీ సాధించేందుకు కూడా ఇదే సరైన సమయం. 

ప్రమాదం: ఫైనల్స్‌లో గెలవలేకపోతుండడం ఆటగాళ్లపై మానసికంగా ప్రభావం చూపవచ్చు. అలాగే ప్రత్యర్థిని వారి స్వదేశంలో ఎదుర్కోనుండడం కూడా జట్టుకు సవాలే.


Updated Date - 2021-07-10T07:55:41+05:30 IST