Abn logo
Sep 16 2020 @ 04:06AM

ఆర్జనలో మెస్సీనే టాప్‌

  రెండోస్థానంలో రొనాల్డో

లండన్‌: ప్రపంచ ఫుట్‌బాలర్లలో అత్యధికంగా ఆర్జిస్తున్న ఆటగాళ్ల జాబితాలో అర్జెంటీనా సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన 2020 జాబితాలో మెస్సీ రూ.927 కోట్లతో టాప్‌లో నిలిచాడు. ఇందులో రూ.677 కోట్లు జీతభత్యాల రూపంలో ఆర్జిస్తుండగా, మిగిలిన రూ.250 కోట్లు వాణిజ్య ప్రకటనల ద్వారా సంపాదిస్తున్నాడు. బార్సిలోనా క్లబ్‌తో తెగదెంపులు చేసుకోవాలని ఈ సాకర్‌ దిగ్గజం ఇటీవల ప్రయత్నించినా ఆర్థిక ఒప్పందాల కారణంగా సాధ్యపడలేదు. ఇక, మెస్సీ తర్వాత పోర్చుగల్‌ సాకర్‌ వీరుడు, యువెంటస్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో రూ.861 కోట్లతో రెండో స్థానంలో ఉండగా,  రూ.706 కోట్ల్లతో బ్రెజిల్‌ ఆటగాడు నెమార్‌ జూనియర్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

Advertisement
Advertisement
Advertisement