ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కాకినాడ ఆర్జేడీల వద్దకు ఎంఈవోల పంచాయితీ

ABN , First Publish Date - 2021-05-08T06:32:54+05:30 IST

అవినీతి అభియోగాలతో సస్పెన్షన్‌కు గురైన ఉంగుటూరు ఎంఈవో ఉదంతంతో యూటీఎఫ్‌ జిల్లా శాఖ, ఎంఈవోల సంఘ జిల్లా శాఖల మధ్య ఏర్పడిన వివాదానికి తెరదించే యత్నాలు శుక్రవారం ఏలూ రులో జరిగాయి.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కాకినాడ ఆర్జేడీల వద్దకు ఎంఈవోల పంచాయితీ

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 7 : అవినీతి అభియోగాలతో సస్పెన్షన్‌కు గురైన ఉంగుటూరు ఎంఈవో ఉదంతంతో యూటీఎఫ్‌ జిల్లా శాఖ, ఎంఈవోల సంఘ జిల్లా శాఖల మధ్య ఏర్పడిన వివాదానికి తెరదించే యత్నాలు శుక్రవారం ఏలూ రులో జరిగాయి.  ఏలూరు డీఈవో కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన కాకినాడ ఆర్జేడీ ఆర్‌. నరసింహారావు, ఏలూరు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన ఉపాఽ ద్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీతో ఎంఈవోల సంఘ జిల్లా నాయకులు వేర్వేరుగా సమావేశమై వివాదానికి పరిష్కార మార్గాలతోపాటు, మిగతా ఎంఈవోలు ఎదు ర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. ఉంగుటూరు ఎంఈవోతోపాటు, మరో ము గ్గురు ఎంఈవోలపైనా పలు అభియోగాలు ఉన్నట్టు సమావేశంలో ప్రస్తావనకు రాగా వాటిని సరిదిద్దేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఎంఈవోల సంఘ నాయ కులు కోరినట్టు సమాచారం. ఈ క్రమంలో జిల్లాలోని ఎంఈవోలపై మండల రిసో ర్స్‌ కేంద్రాలకు విడుదల చేసిన గ్రాంట్ల విడుదలపై యూటీఎఫ్‌ జిల్లా నాయకులు మోపిన అభియోగాలను ఉపసంహరించుకునేలా ఒప్పించేందుకు ఇరువైపులా అంగీకారం కుదిరినట్టు తెలిసింది.

కాకినాడ ఆర్జేడీ నరసింహారావును కలుసుకున్న ఎంఈవోల సంఘ జిల్లా నాయకులు ఉంగుటూరు ఎంఈవోపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని చేసిన అభ్యర్థనపై ఆర్జేడీ సానుకూలంగా స్పందించి జిల్లాలో మరో చోట ఎంఈవోకు పోస్టింగ్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని డీఈవోను ఆదేశించినట్టు సమాచారం. ఎంఈవో సస్పెన్షన్‌ విషయంలో కుల సంఘాలు ప్రవేశించి సమస్యను జఠిలం చేసే  యత్నాలు జరుగుతున్నట్టు సంకేతాలు అందడంతో ముందుగానే పరిష్కార మార్గంతో వివాదానికి తెరదించాలని ఎంఈవోల సంఘ నాయకులు చేసిన ప్రయ త్నాలు సఫలమైనట్టు తెలిసింది.


Updated Date - 2021-05-08T06:32:54+05:30 IST