వచ్చేస్తోంది... రాయల్‌ ‘మెటోర్‌’

ABN , First Publish Date - 2020-07-08T05:30:00+05:30 IST

వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఫేవరెట్‌ బైక్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. ఇప్పుడా సంస్థ నుంచి కొత్తగా ‘మెటోర్‌ 350’ రానుంది. ‘థండర్‌ బర్డ్‌ 350’కి రీప్లేస్‌మెంట్‌గా భావిస్తున్న ఈ బైక్‌, కరోనా లేకపోతే ఈపాటికే రోడ్లపై తిరగాల్సింది...

వచ్చేస్తోంది... రాయల్‌ ‘మెటోర్‌’

వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఫేవరెట్‌ బైక్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. ఇప్పుడా సంస్థ నుంచి కొత్తగా ‘మెటోర్‌ 350’ రానుంది. ‘థండర్‌ బర్డ్‌ 350’కి రీప్లేస్‌మెంట్‌గా భావిస్తున్న ఈ బైక్‌, కరోనా లేకపోతే ఈపాటికే రోడ్లపై తిరగాల్సింది. అయితే ఈ నెలాఖరులో మార్కెట్‌లోకి వస్తున్న ‘మెటోర్‌’లో విశేషాలెన్నో ఉన్నాయి. 


ఫీచర్లు ఇవీ... 

  1. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నూతన జె-ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకొంటున్న ‘మెటోర్‌ 350’ను చూడగానే ‘థండర్‌బర్డ్‌ 350’ గుర్తుకు వస్తుంది. అయితే మెటోర్‌ ఆయిల్‌ ట్యాంక్‌ వినూత్నంగా, రౌండ్‌గా ఉంటుంది. 
  2. వెనకవైపు డిజైన్‌, సైడ్‌ ప్యానెల్స్‌ ఆకట్టుకుంటాయి. అలాగే ఇండికేటర్‌, బ్రేక్‌ ల్యాంప్‌ విభిన్నంగా ఉంటాయి. 
  3. ఈ బైక్‌లో ప్రధాన మార్పు... కిక్‌-స్టార్టర్‌ లేకపోవడం. గేర్‌బాక్స్‌ కంపాక్ట్‌గా, ఎగ్జాస్ట్‌ పైపు కొత్తగా కనిపిస్తాయి. 
  4. ఇంజిన్‌ 19.1 బీహెచ్‌పీ శక్తిని, 28 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. బైక్‌ నాలుగు రంగుల్లో రావచ్చు. 
  5. విండ్‌షీల్డ్‌, బాష్‌ ప్లేట్‌, సీటు, ఫుట్‌ పెగ్స్‌, బ్యాక్‌రెస్ట్‌ వంటివి యాడ్‌ ఆన్స్‌గా వస్తాయి. 
  6. ధర రూ.1.68 నుంచి 1.75 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ‘థండర్‌బర్డ్‌ 350’తో పోలిస్తే ఓ రూ.20 వేలు అధికం.

Updated Date - 2020-07-08T05:30:00+05:30 IST