Abn logo
Oct 21 2021 @ 23:27PM

మీటర్లు రైతులకు ఉరితాళ్లు : తులసిరెడ్డి

తులసిరెడ్డిని పరామర్శిస్తున్న వీరశివారెడ్డి

వేంపల్లె, అక్టోబరు 21: రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం రైతుల మె డలకు ఉరితాళ్లను బిగించినట్లేనని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఆవేదన వెలి బుచ్చారు. గురువారం వేంపల్లెలో మీడియా తో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఉచి త విద్యుత్‌ సరఫరాను ఎత్తివేసే పన్నాగమే మీటర్ల ఏర్పాటన్నారు. బీజేపీ ప్రభుత్వం తె చ్చిన నూతన వ్యవసాయ చట్టాలు తేనె పూసిన కత్తులని, ఈ చట్టాలు రైతులకు, వినియోగదారులకు వ్యతిరేకమని, రిలయన్స్‌ లాంటి బడా వ్యాపారులకు అనుకూలమన్నా రు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతుల వ్యతిరేక విధానాలతో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్ర దేశ్‌ ఇప్పటికే దేశంలో మూడో స్థానంలో ఉందని, మీటర్లు బిగిస్తే ఆత్మహత్యల్లో మొద టి స్థానానికి చేరుకుంటుందని ఆందోళన వ్య క్తం చేశారు. రైతులందరు మూకుమ్మడిగా వైసీపీ, బీజేపీలను ఓడించి కాంగ్రెస్‌ను గెలి పించాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. 

తులసిరెడ్డిని పరామర్శించిన వీరశివారెడ్డి

ఇటీవల కాలువిరిగి శస్త్రచికిత్స చేయించుకుని వేంపల్లెలో విశ్రాంతి తీసుకుంటున్న తులసిరె డ్డిని కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి పరామర్శించారు. దేశ, రాష్ట్ర, జిల్లా రాజ కీయాలు,  ప్రత్యేకించి కమలాపురం నియోజ కవర్గంపై వారు చర్చించుకున్నారు.