Advertisement
Advertisement
Abn logo
Advertisement

మెంతి పులుసు

కావలసిన పదార్థాలు: ఎండు మిర్చి - 5, మెంతులు - ఒకటిన్నర స్పూను, ఆవాలు - ఒక టీ స్పూను, కంది పప్పు - ఒకటిన్నర స్పూను, బియ్యం - ఒక టేబుల్‌ స్పూను, చింతపండు - 75 గ్రా., పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, తాలింపు కోసం: నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ. 


తయారుచేసే విధానం: ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, కందిపప్పు, బియ్యం ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించి చల్లారిన తర్వాత మెత్తగా పొడిచేయాలి. ఇప్పుడు కడాయిలో అర లీటరు చింతపండు రసం పోసి పసుపు, ఉప్పు వేసి మరిగించాలి. తర్వాత మెంతి మిశ్రమం పొడి వేసి చిక్కబడ్డాక దించేయాలి. పులుసు దించేవరకు కలుపుతూనే ఉండాలి. లేదంటే ఉండలు చుడుతుంది. తర్వాత విడిగా తాలింపు వేసి పులుసులో కలిపి రెండు నిమిషాలు మరిగించి దించేయాలి.

వాము చారుకొబ్బరిపాల రసంకల్యాణ రసంపచ్చి మామిడి రసంబెండ పెరుగుఅలసంద సాంబారువంకాయ పచ్చి పులుసుఉలవ చారుమునగాకు రసంములక్కాడ రొయ్య పులుసు
Advertisement