విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్‌ ఫొటోలను షేర్ చేసిన కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-02-20T15:34:01+05:30 IST

బెంగళూరులో త్వరలో అందుబాటలోకి రానున్న...

విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్‌ ఫొటోలను షేర్ చేసిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: బెంగళూరులో త్వరలో అందుబాటలోకి రానున్న తొలి సెంట్రలైజ్‌డ్ ఏసీ రైల్వే టర్మినల్‌కు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు పెట్టారు. తాజాగా ఆ టర్మినల్‌కు సంబంధించిన ఫొటోలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ రైల్వే టర్మినల్‌లో పలు ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 


వీటిలో అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, రియల్ టైమ్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫుడ్ కోర్టు, 4 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్‌ మొదలైనవి ఉన్నాయి. రూ.314 కోట్ల వ్యయంతో 4,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విశ్వేశ్వరయ్య టర్మినల్‌ను ఎయిర్‌పోర్ట్‌ను తలపించే రీతిలో తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ 250 కార్లు, 900 బైకులు, 50 ఆటోరిక్షాలు, 20 క్యాబ్స్, 5 బస్సులను నిలిపివుంచేందుకు పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ఈ నెల చివరినాటికి ఈ టర్మినల్ అందుబాటులోకి రానుంది.

Read more