Metro trainsలో టోకెన్ల స్థానంలో టిక్కెట్లు

ABN , First Publish Date - 2021-10-25T16:09:07+05:30 IST

చెన్నై మహానగరంలో రెండు మార్గాల్లో మెట్రో రైళ్ళు తిరుగుతున్నాయి. అయితే, ఈ మెట్రో రైళ్ళలో ప్రయాణికులకు టోకెన్లను జారీచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోంది. దీంతో టోకెన్ల

Metro trainsలో టోకెన్ల స్థానంలో టిక్కెట్లు

చెన్నై/అడయార్: చెన్నై మహానగరంలో రెండు మార్గాల్లో మెట్రో రైళ్ళు తిరుగుతున్నాయి. అయితే, ఈ మెట్రో రైళ్ళలో ప్రయాణికులకు టోకెన్లను జారీచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోంది. దీంతో టోకెన్ల స్థానంలో టిక్కెట్లను జారీ చేయాలని మెట్రో రైల్‌ యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం ప్లాస్టిక్‌ టోకెన్లను జారీ చేస్తున్నారు. ఈ టోకెన్ల ముద్రణ ఖర్చు కూడా పెరిగిపోతోంది. దీంతో క్యూఆర్‌ కోడ్‌తో ముద్రించిన టిక్కెట్లను పంపిణీ చేయాలని సీఎంఆర్‌ఎల్‌ భావిస్తుంది. అలాగే బోర్డింగ్‌ పాస్‌ కూడా గమ్యస్థానానికి దిగిన స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రంలోని ఒక బటన్‌ను నొక్కితే ఆటోమేటిక్‌గా పాస్‌ వస్తుంది. ఇందుకోసం నగరంలోని 40 మెట్రో స్టేషన్లలో ప్రత్యేక యంత్రాలను అమర్చనున్నారు.

Updated Date - 2021-10-25T16:09:07+05:30 IST