Abn logo
May 17 2021 @ 16:19PM

మెక్సికో అందానికి మిస్ యూనివర్స్ కిరీటం!

మెక్సికో అందం ఆండ్రియా మెజా (26) `మిస్‌ యూనివర్స్‌-2021` కిరీటాన్ని దక్కించుకుంది. ఫ్లోరిడాలో జరిగిన 69వ మిస్ యూనివర్స్ పోటీల ఫైనల్లో గెలుపొంది విశ్వ సుందరి కిరీటం సొంతం చేసుకుంది. 73 మందిని దాటుకుని మెజా టైటిల్ గెలుచుకుంది. మిస్ యూనివర్స్ కిరీటాన్ని చేజిక్కించుకున్న మూడో మెక్సికన్‌గా నిలిచింది. `మన ప్రవర్తన కూడా మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది. మిమ్మల్ని ఎవరు తక్కువగా చూసినా ఒప్పుకోవద్దు` అంటూ మెజా చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను మెప్పించింది. 

సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పొందిన మెజా.. మహిళా హక్కుల కోసం, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తోంది. ఇక, ఈ పోటీలో తొలి రన్నరప్‌గా మిస్‌ బ్రెజిల్‌ జులియా గామా, రెండో రన్నరప్‌గా మిస్‌ పెరూ జానిక్‌ మెసెటా డెల్‌ కాసిలో నిలిచారు. మిస్‌ ఇండియా అడెలిన్‌ కాస్టెలినో టాప్‌-5లో స్థానం సంపాదించుకుకుంది. 



ప్రత్యేకంమరిన్ని...

Advertisement