ఎంజీ మోటార్స్‌ ఆస్టర్‌

ABN , First Publish Date - 2021-09-16T08:13:38+05:30 IST

ఎంజీ మోటార్‌ ఇండియా మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ ఆస్టర్‌ను ఆవిష్కరించింది.

ఎంజీ మోటార్స్‌ ఆస్టర్‌

ఎంజీ మోటార్‌ ఇండియా మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ ఆస్టర్‌ను ఆవిష్కరించింది. హ్యుండయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌, స్కోడా కుషాక్‌కు పోటీగా ఎంజీ మోటార్‌ ఈ కారును మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. పెట్రోల్‌ వేరియంట్‌లోనే రెండు ఇంజన్‌ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉండనుంది. ఐదు సీట్ల సామర్థ్యంతో కూడిన ఈ కారును ఈనెల 19 నుంచి ఎంజీ షోరూమ్‌ల్లో ప్రదర్శనకు ఉంచనున్నట్లు కంపెనీ తెలిపింది. ఆ వెంటనే బుకింగ్‌లు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-09-16T08:13:38+05:30 IST