Abn logo
Jan 17 2021 @ 16:36PM

ఏంజీఆర్‌ 104వ జయంతి.. పోస్టర్, వీడియో‌ విడుదల చేసిన 'తలైవి' యూనిట్‌

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ 'తలైవి'. బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటించారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఆదివారం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ 104వ జయంతి సందర్భంగా తలైవి  సినిమా నుండి కొత్త పోస్టర్‌, ఎంజీఆర్‌కు సంబంధించిన ఓ వీడియోను కంగనా రనౌత్‌ ట్వీట్ చేసింది. తలైవి చిత్రంలో ఎంజీఆర్‌ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌ సింగ్‌, బృందా ప్రసాద్‌  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ కరుణానిధి పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్‌ పూర్ణ, శశికళ పాత్రలో నటిస్తుంది. 


Advertisement
Advertisement
Advertisement