విదేశీయులకు టూరిస్ట్ వీసాలు నవంబరు 15 నుంచి

ABN , First Publish Date - 2021-10-08T01:21:37+05:30 IST

భారత దేశానికి వచ్చే విదేశీయులకు టూరిస్టు వీసాల జారీ సేవలను

విదేశీయులకు టూరిస్ట్ వీసాలు నవంబరు 15 నుంచి

న్యూఢిల్లీ : భారత దేశానికి వచ్చే విదేశీయులకు టూరిస్టు వీసాల జారీ సేవలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) పునరుద్దరిస్తోంది. ఛార్టర్డ్ విమానాల్లో వచ్చేవారికి అక్టోబరు 15 నుంచి, ఇతర విమానాల్లో వచ్చేవారికి నవంబరు 15 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. కోవిడ్-19 సంబంధిత నిబంధనలను యాత్రికులు, సంస్థలు పాటించాలని తెలిపింది. 


ఎంహెచ్ఏ విడుదల చేసిన ప్రకటనలో, విదేశీ యాత్రికులు, వారిని భారత దేశానికి తీసుకొచ్చే విమానయాన సంస్థలు, ఇతర సంబంధితులు కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. 


కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విదేశీయులకు మంజూరు చేసిన అన్ని వీసాలను ప్రభుత్వం గత ఏడాది సస్పెండ్ చేసింది. అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ఆంక్షలను విధించింది. కోవిడ్-19 పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత విదేశీయులు భారత్‌ వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  టూరిస్ట్ వీసా మినహా ఇతర ఇండియన్ వీసాలపై భారత్‌కు రావచ్చునని తెలిపింది. టూరిస్టు వీసాలను పునఃప్రారంభించాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. 


Updated Date - 2021-10-08T01:21:37+05:30 IST