అద్భుత ఫీచర్లతో ఎంఐ స్మార్ట్‌ఫోన్స్ విడుదల

ABN , First Publish Date - 2020-10-01T01:47:11+05:30 IST

అద్భుత ఫీచర్లతో ఎంఐ స్మార్ట్‌ఫోన్స్ విడుదల

అద్భుత ఫీచర్లతో ఎంఐ స్మార్ట్‌ఫోన్స్ విడుదల

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఎంఐ 10టీ, ఎంఐ 10టీ ప్రో, ఎంఐ 10టీ లైట్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎంఐ 10టీ ఫోన్ రూ.43,000, 8జీబీ ర్యామ్, 128జీబీ మోడల్ ఫోన్ రూ. 47,200, ఎంఐ 10టీ ప్రో రూ. 51,700, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ. 56,000 ఉంటుంది. మూడు రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

Updated Date - 2020-10-01T01:47:11+05:30 IST