Abn logo
Aug 13 2020 @ 03:55AM

పాక్‌ క్రికెట్‌ను నాశనం చేశాడు

ఇమ్రాన్‌పై మియాందాద్‌ మండిపాటు

న్యూఢిల్లీ: తన మాజీ సహచరుడు, ప్రస్తుత పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దేశంలో క్రికెట్‌ను నాశనం చేశాడని ఆ దేశ లెజెండరీ ఆటగాడు జావేద్‌ మియాందాద్‌ తీవ్ర ఆరోపణ చేశాడు. క్రికెట్‌లో ఏబీసీలు కూడా తెలియని వారిచేతిలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)ను పెట్టాడని విమర్శించాడు. ‘పీసీబీలోని ఏ ఒక్క అధికారికీ క్రికెట్‌ గురించి అవగాహన లేదు. బోర్డు వ్యవహారాలను ప్రధాని ఇమ్రాన్‌ పట్టించుకోవడంలేదు. పీసీబీలోని పరిస్థితులపై ఇమ్రాన్‌ ఖాన్‌తో వ్యక్తిగతంగా మాట్లాడతా. దేశంలో క్రికెట్‌ దుస్థితికి కారకులైన వారిని వదలను’ అని మియాందాద్‌ చెప్పుకొచ్చాడు. క్రికెట్‌ గురించి తనకొక్కడికే అంతా తెలుసునని ఇమ్రాన్‌ భావిస్తున్నాడని అన్నాడు.

Advertisement
Advertisement
Advertisement