టీకా లేదు.. మాస్కూ వద్దట!

ABN , First Publish Date - 2021-07-31T08:51:31+05:30 IST

అమెరికా స్విమ్మర్‌ మైకేల్‌ ఆండ్రూ మాస్క్‌లేకుండా విలేకరులతో మాట్లాడడం విమర్శలకు తావిచ్చింది.

టీకా లేదు.. మాస్కూ వద్దట!


అమెరికా స్విమ్మర్‌ మైకేల్‌ ఆండ్రూ మాస్క్‌లేకుండా విలేకరులతో మాట్లాడడం విమర్శలకు తావిచ్చింది. అందులోనూ.. తాను కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకోలేదని ప్రకటించిన మైకేల్‌ చర్యను నెటిజన్లు ఆక్షేపిస్తున్నారు. పురుషుల 200 మీ. ఫ్రీస్టయిల్‌ వ్యక్తిగత మెడ్లే ఈవెంట్‌ అనంతరం మీడియాతో మాట్లాడేందుకు కేటాయించిన ‘మిక్స్‌డ్‌ జోన్‌’లో ఆండ్రూ మాస్క్‌ ధరించకుండా విలేకరులతో ముచ్చటించాడు. మరోవైపు విలేకరులు మాస్క్‌తోపాటు ఫేస్‌ షీల్డులు ధరించి అథ్లెట్లను ఇంటర్వ్యూ చేయాలి.. ఇక..తాను మాస్క్‌ పెట్టుకోకపోవడంపై మైకేల్‌ ‘నీటిలో అంతసేపు గడిపిన అనంతరం బయటకు వచ్చాక మాస్క్‌ ధరిస్తే ఊపిరి ఆడనట్టు ఉంటుంది’ అన్నాడు. వ్యాక్సిన్‌ కూడా వేసుకోలేదు కదా అంటే.. తనకు గతంలోనే కరోనా సోకిందని, అందుకే వ్యాక్సిన్‌ అవసరంలేదని అతడు బదులివ్వడం గమనార్హం. 22 ఏళ్ల మైకేల్‌ గత ఏడాది కొవిడ్‌ బారినపడ్డాడు. వ్యాక్సిన్‌ వేయించుకోకుండానే టోక్యో వచ్చాడు.

Updated Date - 2021-07-31T08:51:31+05:30 IST