Abn logo
Sep 25 2021 @ 23:16PM

చెత్త కంటెంట్ కనిపించడానికి వీల్లేదు.... బాంబులు పెట్టిన michigan వృద్ధుడు!

మిషిగాన్: అశ్లీల కంటెంట్ సమాచార మార్పిడికి అవకాశమిస్తున్న టెలికాం సంస్థలపై నిరసనగా రెండు సెల్ ఫోన్ షాపులను బాంబులతో పేల్చేసేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడిని అమెరికా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వెరిజాన్, ఏటీ అండ్ టీ నిర్వహించే రెండు స్టోర్లలో అతడు అమర్చిన బాంబులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మిషిగాన్ రాష్ట్రానికి చెందిన జాన్ డగ్లస్ ఎలెన్‌గా అధికారులు గుర్తించారు. ఆగస్టు 25న మిచిగాన్ రాష్ట్రం సెయింట్ ఇగ్నేస్‌లో ఓ సెల్ ఫోన్ టవర్ వద్ద కొందరు బెదిరింపు లేఖను వదలివెళ్లారు. టెలికాం సంస్థలు అశ్లీల కంటెంట్ ప్రసారానికి అవకాశం ఇవ్వకూడదంటూ వారు హెచ్చరించారు. అంతేకాకుండా..టెలికాం సంస్థల నుంచి 5 మిలియన్ డాలర్లను డిమాండ్ చేశారు. మరో రెండు సెల్ టవర్ల వద్ద కూడా ఇలాంటి లేఖలు దర్శనమిచ్చాయి. తాము ముప్ఫై మంది సభ్యులున్న బృందమని, తమలో ఎవ్వరినీ అరెస్టు చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయితే..  సెప్టంబర్ 15న ఇదే బృందానికి చెందిన అలెన్ రెండు సెల్ ఫోన్ స్టోర్ల వద్ద కూడా బాంబులు పెట్టాడు. పోలీసులు తాజాగా అతడిని అరెస్టు చేశారు. 

తాజా వార్తలుమరిన్ని...