కొత్త విధానం.. తెరపైకొచ్చిన మైక్రో కంటైన్మెంట్ జోన్లు!

ABN , First Publish Date - 2020-06-01T23:10:17+05:30 IST

అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మైక్రో కంటైన్మెంట్ జోన్ల పేరిటి కొత్త విధానానికి తెరలేపింది.

కొత్త విధానం.. తెరపైకొచ్చిన మైక్రో కంటైన్మెంట్ జోన్లు!

అహ్మదాబాద్: అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మైక్రో కంటైన్మెంట్ జోన్ల పేరిటి కొత్త విధానానికి తెరలేపింది. లాక్ డౌన్ ముగింపుకు దేశం సిద్ధమవుతున్న నేపథ్యంలో నగరం పాలక సంస్థ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.  ఏ ప్రాంతంలోనైనా కరోనా కేసు వెలుగు చూస్తే ఆ వార్డు మొత్తాన్ని కంటైన్నెమంట్ జోన్‌గా స్థానిక ప్రభుత్వం ఇప్పటి వరకూ పరిణిస్తూ వచ్చింది. ఈ జోన్లలో పూర్తి స్థాయి ఆంక్షలు అమలు చేసింది. ప్రస్తుతం మొత్తం 13 లక్షల మంది ఇటువంటి జోన్లలో నివసిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే సోమవారం నాడు నగర పాలక సంస్థ మైక్రో కంటైన్మెంట్ జోన్ల విధానాన్ని తెరపైకి తెచ్చింది. కరోనా వెలుగు చూసి ఇళ్లతో పాటూ చుట్టుపక్కల ఉన్న కొంత ప్రాంతాన్ని కలిపి ఈ జోన్లను ఏర్పాటు చేసింది. ఈ జోన్ల విస్తీర్ణం మునుపిటితో పోలిస్తే తక్కువగా ఉండటంతో ఇటువంటి జోన్లలో నివసిస్తున్న వారి సంఖ్య 13 లక్షల నుంచి 70 వేలకు తగ్గిపోయింది. ఈ మైక్రో కంటైన్మెంట్‌ జోన్లలో మునిపటి లాగానే కరోనా ఆంక్షలన్ని కచ్చితంగా అమలవుతాయని తెలిపింది. ఇక్కడ అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తామని, రాత్రి వేళ్లలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ జోన్ల లిస్టును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తామని కూడా అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-06-01T23:10:17+05:30 IST