Advertisement
Advertisement
Abn logo
Advertisement

మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ డివైస్‌

మైక్రోసాఫ్ట్‌ భారత మార్కెట్‌లోకి పదమూడు ఇంచీల సర్ఫేస్‌ డివైస్‌ను విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ ప్రొ ఎక్స్‌ పేరిట ఇది రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్స్‌ అలాగే రిలయన్స్‌డిజిటల్‌.ఇన్‌లో లభిస్తుంది. వినియోగదారులకు ఈ లాప్‌టాప్‌ రూ.93,999కి లభ్యమవుతుంది. వ్యాపార సంస్థలకు 8జీబీ రామ్‌, 128జీబీ స్టోరేజీతో రూ.94,599కి, 8జీబీ రామ్‌, 256 జీబీ స్టోరేజీతో రూ.1,13,299కి లభిస్తాయి. ఎస్‌క్యు1 చిప్‌సెట్‌ పవర్‌సెట్‌ను కలిగి ఇవి ఉంటాయి. ఎస్‌క్యు2 చిప్‌సెట్‌పై ఆసక్తి ఉంటే 16జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజీ సదుపాయం ఉన్నవి రూ.1,31,799కి 512 జీబీ అయితే రూ.1,50,499కి కొనుగోలు చేయవచ్చు. 


పదమూడు ఇంచీల డివైస్‌ టచ్‌స్ర్కీన్‌ డిస్‌ప్లేతో బరువు 774 గ్రాములు. ఉన్నవాటిలో ఇదే తక్కువ బరువు ఉన్న లాప్‌టాప్‌ అని కంపెనీ చెబుతోంది. ఇందులో కిక్‌స్టాండ్‌ బిల్ట్‌-ఇన్‌. దాంతో డివైస్‌ను ఇష్టమైన కోణంలోకి తిప్పుకోవచ్చు. విండోస్‌ 11కు తోడు 64-బిట్‌ ఎమ్యులేషన్‌ కూడా బిల్ట్‌-ఇన్‌. ఎఆర్‌ఎం కోసం మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, ఆఫీస్‌ వంటి యాప్స్‌ను ఆప్టిమైజ్‌ చేశారు. వైఫై కనెక్టివిటీకి కూడా ఇది చాలా మంచి డివైస్‌ అని చెబుతున్నారు. బిల్ట్‌ ఇన్‌ 5.0ఎంపి ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా, 1080 హెచ్‌డి వీడియోతో లైటింగ్‌కు అనుగుణంగా అడ్జస్ట్‌మెంట్‌ కూడా సాధ్యమవుతుంది.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...