విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి

ABN , First Publish Date - 2021-12-07T04:58:22+05:30 IST

మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ లేదని, పోషకాహారంతో కూడి భోజనాన్ని విద్యార్థులకు అందించాలని మధ్యాహ్న భోజనం పథకం (ఎండీఎం) డైరెక్టర్‌ దివాన్‌ మైఠిన్‌ తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి
భోజనం పరిశీలిస్తున్న మైఠిన్‌

పెదపాడు, డిసెంబరు 6: మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ లేదని, పోషకాహారంతో కూడి భోజనాన్ని విద్యార్థులకు అందించాలని మధ్యాహ్న భోజనం పథకం (ఎండీఎం) డైరెక్టర్‌ దివాన్‌ మైఠిన్‌ తెలిపారు. అప్పనవీడు జడ్పీ ఉన్నత పాఠశాలను సోమవారం ఆయ న సందర్శించారు. విద్యార్థుల కోసం తయారు చేసిన భోజనాన్ని స్వయంగా తిని నాణ్యత పరిశీలించారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఏమైనా సలహాలు, సూచనలు, ఫిర్యాదులు ఉంటే నేరుగా తన ఫోన్‌ నెంబరుకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ఒక వారంలో తన వాట్సాప్‌ నెంబరు ప్రతి విద్యార్థి వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివాలన్నారు. హెచ్‌ఎం. వి.రంగప్రసాద్‌, కె.జయశుభాకరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T04:58:22+05:30 IST