Abn logo
May 18 2020 @ 04:50AM

న(డ)రక యాతన..

కాళ్లనే నమ్ముకుని సాగుతున్న ప్రయాణం

స్వగ్రామాలకు వెళ్లాలనే తపనలో వలస కార్మికులు

కొందరు లారీల్లో, మరికొందరు మోటారుసైకిళ్లపై..

వాహనాలను సమకూర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్న కార్మికులు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి):భవన నిర్మాణం, ఇతర రంగాల్లో పనులు చేసుకునేందు కు ప్రభుత్వం ఆంక్షలు సడలించినా వలస కార్మికులు ఆగ డం లేదు. అర్ధాకలితో అలమటిస్తున్న కార్మికులు తమ స్వ గ్రామాలకు వెళ్లేందుకే మానసికంగా సిద్ధమయ్యారు. నెల రోజుల నుంచి వేలాది మంది నడుచుకుంటూ వెళ్లారు. వారి పరిస్థితిని గమనించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రైళ్లను ఏ ర్పాటుచేసింది. దీంతో వేలాదిమంది తమ పేర్లను సంబంధిత అధికారుల వద్ద నమోదు చేసుకు న్నారు. కొందరు కార్మికులను పంపించగా, అటునుంచి ఇటు, ఇటునుంచి అటు వెళుతున్న, వస్తున్న వారితో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో కేంద్రం రైళ్లను నిలిపివేసింది.


రెండు, మూడు రోజులు వేచిచూసిన కార్మికులు కాలే కడుపులతో మూటముల్లెలు, పిల్లాపాప లతో కాళ్లనే నమ్ముకుని నడక సాగిస్తున్నారు. పోలీసులు, సంబంధిత అధికారులు వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించినా ఆగడం లేదు. అయినా ప్రభుత్వం వారికి ప్రత్యేక వాహ నాలను సమకూర్చడం లేదు. దారివెంట కాలినడకను వెళుతూనే లారీలను ఆపుతున్నారు. కొందరు ఆపి తీసు కెళుతుండగా, మరి కొందరు తీసుకెళ్లడం లేదు. దీంతో వలసకార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ, ఓ పూట తింటూ,మరోపూట ఎండుతూ ఎండలను సైతం లెక్క చేయకుండా వెళుతున్న తీరు కలవరానికి గురిచేస్తున్నది. జిల్లాలో 21వేల మంది భవన కార్మికులు ఉండగా, ఇందులో 8 వేల మందికి పైగా వెళ్లిపో యారు. తమ ప్రాంతాలకు వెళ్లేందుకు 6వేల మంది దర ఖాస్తు చేసుకోగా, ఒక్క గోదావరిఖని ప్రాంతం నుంచే 4వేల మందిని స్థానిక పోలీ సులు వాహనాలు సమకూర్చి వారి ప్రాంతాలకు పంపించారు.


జిల్లాలో పని చేస్తు న్న వారే గా కుండా కరీం నగర్‌, సిద్ధిపేట, హైదరాబాద్‌, జగి త్యాల, రాజ న్న సిరిసిల్ల జిల్లాల నుంచే గాకుండా ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా వలస కార్మికులు పెద్దపల్లి జిల్లా మీదుగా వెళుతు న్నారు. కుటుంబాలతో కలిసి వచ్చిన వాళ్లంతా కాలినడకన వెళుతుండగా, పెళ్లి కాని యువకులు కాలినడకన వెళుతూ నే లారీలను ఆపి అందులో వెళుతున్నారు. మరికొందరు బైకులపై వెళుతున్నారు. 


శనివారం హైదరాబాద్‌ నుంచి దాదాపు 30 మంది రాజీవ్‌ రహదారి గుండా నడుచుకుంటూ ఉత్తరప్రదేశ్‌కు బయలుదేరారు. వాళ్లు పెద్దపల్లి జిల్లా బసంత్‌ నగర్‌ టోల్‌ గేట్‌ వద్ద ఆగారు. అక్కడ లారీలను ఆపుతూ అందులో వెళ్లారు. మరో 16 మంది వరకు సిద్దిపేట నుంచి మూడు రోజుల క్రితం కాలినడకన బయలుదేరారు. వీళ్లంతా ఛత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్‌కు వెళుతున్నారు. ఉదయం నాలుగు గంటలు, సాయంత్రం 4 గంటలు నడుస్తున్నారు. భవన నిర్మాణ పనుల కోసం వచ్చారు. తమ ఇంటి నుంచి రావాలని ఫోన్లు వస్తుండడంతో వాళ్లు కాలినడకన బయలు దేరారు. సిద్ధిపేటలో తమను ఏదైనా వాహనాల్లో పంపిం చాలని అధికారులను కోరినా ఫలితం లేకపోవడంతో మూడు రోజుల క్రితం బయలుదేరామని చెప్పారు. శుక్రవారం ఒక రోజంతా తిండి లేకనే మంచినీళ్లు తాగుతూ గడిపామని వాళ్లు చెప్పారు. 


బసంత్‌నగర్‌ టోల్‌గేట్‌ వద్దకు చేరుకున్న వాళ్లకు స్థానికులు భోజనాలు పెట్టారు. తిరిగి వెళ్లేందుకు సాయం త్రం బయలుదేరారు. లాక్‌డౌన్‌, కనోనా అయిపోయిన తర్వాత మళ్లీ ఇక్కడికి పనుల కోసం వస్తామని చెబుతున్నారు. ఆదివారం కూడా హైదరాబాద్‌ నుంచి కాలినడకన బయలుదేరిన వాళ్లు పెద్దపల్లి మీదుగా వెళ్లడం గమనార్హం. ఎంత చెప్పినా, పనులు కల్పించినా వాళ్లు వినే పరిస్థితిలో లేరు. వాళ్లు తమ స్వగ్రామాలకు వెళ్లాలనే పట్టుదలతోనే ఉన్నారు. మండుతున్న ఎండలు తిండి లేకున్నా వారి ప్రయాణం సాగుతూనే ఉన్నది. తమను తమ ప్రాంతాలకు పంపించేందుకు ఇక్కడి ప్రభుత్వం తమకు వాహనాలను సమకూర్చాలని కార్మికులు కోరుతున్నారు. 

Advertisement
Advertisement