వలస కూలీలను తప్పనిసరిగా స్ర్కీనింగ్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-06-02T09:44:26+05:30 IST

జిల్లా నుంచి స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు పేర్లు నమోదుచేసుకున్న వలసకూలీలను పంపందేకు మూడు ప్రత్యేక రైల్లు ఏర్పాటు చేశామని కలెక్టర్‌కె శశాంక

వలస కూలీలను తప్పనిసరిగా స్ర్కీనింగ్‌ చేయాలి

జిల్లా కలెక్టర్‌  శశాంక


భగత్‌నగర్‌, జూన్‌ 1: జిల్లా నుంచి స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు పేర్లు నమోదుచేసుకున్న వలసకూలీలను పంపందేకు మూడు ప్రత్యేక రైల్లు ఏర్పాటు చేశామని కలెక్టర్‌కె శశాంక అన్నారు. సోమవారం వలస కూలీలకు రైళ్లలో కల్పిస్తున్న సౌకర్యాలను సీపీ వీబీ కమలాసన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌తో పాటు నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఆరువేల మంది వలస కూలీలను ప్రత్యేక బస్సులలో కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌కు రాగానే ప్రతి ఒక్కరికి స్ర్కీనింగ్‌ టెస్టు చేసిన తదుపరి రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌కు పంపాలని అన్నారు.రైలు కోచ్‌లలో ఎక్కించిన ఒక్కొక్కరికి రాత్రి భోజనం, మరుసటి రోజు ఉదయానికి అల్పాహారం, రెండు లీటర్ల నీళ్ల బాటిల్లు అందించాలని అధికారులకు సూచించారు.


అనంతరం పోలీస్‌కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ రైల్వేస్టేషన్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టుమైన పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, ఏసీపీ శ్రీనివాస్‌, రూరల్‌ ఏసీపీ విజయసారధి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత పాల్గొన్నారు.

Updated Date - 2020-06-02T09:44:26+05:30 IST