వలస గోస

ABN , First Publish Date - 2020-05-18T10:23:51+05:30 IST

లాక్‌డౌన్‌తో వలస కార్మికులకు కష్టాలు తప్ప డం లేదు. జిల్లాలోని ఇటుకబట్టీల్లో పని చేసేం దుకు ఒడిశా నుంచి వచ్చిన కార్మికులు స్వస్థలా లకు వెళ్లేందుకు ..

వలస గోస

 లాక్‌డౌన్‌తో కరువైన ఉపాధి 

మూటాముల్లె సర్దుకుంటున్న ఇటుకబట్టీల కార్మికులు

కాలినడకన వెళ్లేందుకు రోడ్లపైకి 

అడ్డుకుంటున్న అధికారులు 

మంత్రి కేటీఆర్‌ జోక్యంతో రెండు బస్సులో తరలిన 85 మంది  

ఇటుక బట్టీ యజమానులతో అఽధికారుల సమావేశం


 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల):లాక్‌డౌన్‌తో వలస కార్మికులకు కష్టాలు తప్ప డం లేదు. జిల్లాలోని ఇటుకబట్టీల్లో పని చేసేం దుకు ఒడిశా నుంచి వచ్చిన కార్మికులు స్వస్థలా లకు వెళ్లేందుకు మూటాముళ్లెతో రోడ్లపైకి వస్తు న్నారు.యజమానులు వెళ్లమనడంతోనే కాలినడక న సొంత ఊళ్లకు బయల్దేరామని చెబుతున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో రోడ్డెక్కిన ఇటుకబట్టీల కార్మికులను అధికారులు అడ్డుకున్నారు. పోత్గల్‌ నుంచి కాలినడకన సిరిసిల్లకు చేరుకున్న వలస కార్మికులను తరలించడానికి ఏఐసీసీ కార్యదర్శి హన్మంతరావు బస్సులతో రావడం, అధికారులు అడ్డుకోవడం వంటి పరిణామాలు ఘర్షణ వాతా వరణానికి దారితీశాయి. అనంతరం మంత్రి కేటీ ఆర్‌ ఆదేశాలతో వారిని రెండు ప్రత్యేక బస్సుల్లో ఒడిశాకు పంపించారు.


మరోవైపు  సిరిసిల్ల మం డలం రగుడు వద్ద  ఉన్న ఇటుకబట్టీల్లోని 50 మంది కార్మికులు శనివారం రాత్రి  కాలినడకన బయల్దేరారు. వేము లవాడ మండలం ఆరెపల్లె వద్ద అధికా రులు వారిని అడ్డు కున్నారు. అక్కడే తాత్కాలిక వసతి ఏర్పాటు చేశా రు. జిల్లాలోని ఇతర మండలాల్లోని ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న కార్మికులు కూడా సొంత ఊర్లకు వెళ్లడానికి రోడ్లమీదకు వస్తుండడంతో అధికారులు ఇటుకబట్టీల యజమానులతో సమావేశం నిర్వ హించారు. సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. 


తిరిగి వస్తున్న వారితో భయం 

లాక్‌డౌన్‌ సడలింపుతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో చిక్కుకున్నవారు జిల్లాకు తిరిగివస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుం డడంతో సొంత ఊళ్లకు వచ్చినవారికి పాజిటివ్‌ వ స్తుందేమోనని  జిల్లా ప్రజల్లో భయం నెలకొంది. 


వలస కార్మికులకు అండగా ఉంటాం 

వలస కార్మికులు ఆందోళన చెందవద్దని జిల్లా యంత్రాంగం  అన్ని విధాలుగా అండగా ఉంటుం దని ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో జిల్లాలోని ఇటుకబట్టీల యజమానులతో సమావేశమయ్యా రు. వలస కార్మికులకు పనిచేస్తున్న స్థలంలో కల్పి స్తున్న భోజన వసతి, సౌకర్యాలను  అడిగి తెలు సుకున్నారు.  కష్ట సమయంలో వలస కార్మికుల కు అండగా ఉండాల్సిన బాధ్యత యజమానుల దేనన్నారు. కార్మికులకు స్వస్థలాలకు పంపించ డానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం శ్రామిక రైళ్ల ద్వారా వలస కార్మికులను  స్వస్థ లాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు ఇబ్బందులు పడితే అధికారుల దృష్టికి తీసుకు రావాలని పేర్కొన్నారు. సమావేశంలో సీఐ వెంకట నర్సయ్య, తహసీల్దార్లు ఉన్నారు. 

Updated Date - 2020-05-18T10:23:51+05:30 IST