Abn logo
May 21 2020 @ 09:25AM

రానా-మిహిక.. టాటూ బంధం!

బ్యాచిలర్ లైఫ్‌కి బై.. బై.. చెప్పేసి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా. ఇటీవల తన ప్రేయసిని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన రానా.. పెళ్లికి రెడీ అని షాకింగ్ న్యూస్ చెప్పాడు. పెళ్లి ముహూర్తాల కోసం ఇరు కుటుంబాల పెద్దలు తాజాగా కలుసుకున్నారు. 


పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకున్నారని, త్వరలోనే వివరాలు ప్రకటిస్తారని సమాచారం. కాగా, తనకు కాబోయే భర్త పేరులోని తొలి అక్షరమైన `R`ను, తన పేరులోని తొలి అక్షరమైన `M`ను లవ్ సింబల్‌తో కలిపి తన చేతిపై మిహిక టాటూ వేయించుకుంది. ఈ ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


Advertisement
Advertisement
Advertisement