వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో గురువారం రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు.. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఫోన్ చేసి, ఆమెతో సంభాషించారు. ఈ సందర్భంగా కమలా హారిస్‌కు మైక్ పెన్స్ అభినందనలు తెలపడంతోపాటు అధికార బదిలీకి సహకరిస్తానని చెప్పారు. కాగా.. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన నేతలకు ప్రస్తుత పాలకులు ఫోన్ చేసి అభినందించడం అమెరికాలో ఆనవాయితీగా వస్తోంది. కాగా.. కేపిటల్ ఘటన జరిగి సుమారు 10 రోజులు అయిన తర్వాత కమలా హారిస్‌ను మైక్ పెన్స్.. ఫోన్ ద్వారా అభినందించడం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పదే పదే వాదిస్తున్న ట్రంప్ మాత్రం ఈ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి సర్వం సిద్ధమవుతున్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇప్పటి వరకు ఆయనకు అభినందనలు తెలపలేదు.