శునకాన్ని సంరక్షిస్తున్న రోబో!

ABN , First Publish Date - 2021-02-22T12:26:33+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఒక యువకుడు...

శునకాన్ని సంరక్షిస్తున్న రోబో!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఒక యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్న శునకానికి సాయమందింంచిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ శునకం తన దగ్గరకు మనుషులను ఎవరినీ రానివ్వడంలేదు. ఈ సంగతిని గుర్తించిన ఆ యువకుడు శునకం కోసం ఒక రోబోను తయారు చేశాడు. లక్నోలోని గోమతి నగర్‌కు చెందిన మిలింద్‌రాజ్ లాక్‌డౌన్ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక శునకాన్ని చేరదీశాడు. ఆ శునకానికి కళ్లు సరిగా కనిపించకపోవడంతో పాటు చెవులు కూడా వినిపించవు.


దానిని ఎవరో తీవ్రంగా కొట్టడం కారణంగా అది గాయపడిందని మిలింద్‌రాజ్ గుర్తించాడు. ‘డ్రోన్ మ్యాన్‘గా గుర్తింపు పొందిన ఆయన ఆ శునకాన్ని వైద్యునికి చూపించాడు. అప్పుడు ఆ వైద్యుడు ఆ శునకం మనుషులకు దూరంగా ఉండాలనుకుంటోందని తెలిపారు. దీంతో  మిలింద్‌రాజ్ ఆ శునకాన్ని సంరక్షించేందుకు ఒక రోబోను తయారు చేశాడు. శునకానికి ఆ రోబో సమయానికి ఆహారం అందిస్తుంది. దానికిచ్చే ఆహారంలో బిస్కట్లు, పాలు మొదలైనవి ఉంటాయి. ఆ రోబో నిరంతరం ఆ శునకాన్ని కనిపెట్టుకుని ఉంటుంది. రోబోను శునకం కూడా ఇష్టపడుతోంది. ఈ సందర్భంగా మిలింద్‌రాజ్ మాట్లాడుతూ గత ఏడు నెలలుగా ఆ శునకాన్ని సాకుతున్నానని, దాని ఆరోగ్యం కూడా మెరుగుపడిందన్నాడు. ఆ శునకానికి సాయమందించేందకు ఇంటెలిజంట్ రోబోను తయారుచేశానని తెలిపాడు. 

Updated Date - 2021-02-22T12:26:33+05:30 IST