Abn logo
Jun 7 2020 @ 12:23PM

‘మిళిర్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల

అందాల భామ ఐశ్వర్యదత్తా నటిస్తున్న తమిళ చిత్రం ‘మిళిర్‌’ పోస్టర్‌ ఫస్ట్‌లుక్‌ విడుదలై సంచలనం సృష్టించింది. ఆ పోస్టర్‌లో వెరైటీ మేకప్‌లో ఉన్న ఐశ్వర్యదత్తాను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఐశ్వర్యదత్తా ‘ఎన్‌ ఒండ్రై అళుత్తవుమ్‌’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ చిత్రంలో ఆమె నటన తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె బిగ్‌బాస్‌ సీజన్‌-2లో పాల్గొని తమిళ ప్రేక్షకులకు  దగ్గరైంది. ఈ నేపథ్యంలో ఐశ్వర్యదత్తా నటిస్తున్న ‘మిళిర్‌’ చిత్రం పోస్టర్‌ ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు పా.రంజిత్‌ విడుదల చేశారు. వెబ్‌సైట్‌లో విడుదలైన ఆ పోస్టర్‌ ఐశ్వర్యదత్తా అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఆ పోస్టర్‌లో ఐశ్వర్యాదత్తా తలకు బ్యాండేజీ వేసుకుని రెండు చేతులతో ఓ కొయ్యముక్కను పట్టుకుని ఆ కొయ్య మధ్యభాగాన్ని నోటల్లో పెట్టుకొని అదుముతున్న భంగిమలో కనిపిస్తోంది. పోస్టర్‌ ఫస్ట్‌లుక్‌లోనే వెరైటీగా కనిపిస్తున్న ఐశ్వర్యదత్తా ఆ చిత్రంలో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నటించిందని దర్శకుడు పా.రంజిత్‌ చెబుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement