నేటి నుంచి పాల సేకరణ

ABN , First Publish Date - 2022-01-28T06:15:49+05:30 IST

జగనన్న పాలవెల్లువ కింద కదిరి డివి జన్‌ పరిధిలోని కదిరి, తలుపుల, నల్లచెరువు, గాండ్లపెంట మండలాల పరిధిలో 60 గ్రామాల్లో శుక్రవారం నుంచి పాల సేకరణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు.

నేటి నుంచి పాల సేకరణ

 కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌

కదిరిఅర్బన్‌, జనవరి 27: జగనన్న పాలవెల్లువ కింద కదిరి డివి జన్‌ పరిధిలోని కదిరి, తలుపుల, నల్లచెరువు, గాండ్లపెంట మండలాల పరిధిలో 60 గ్రామాల్లో శుక్రవారం నుంచి పాల సేకరణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని పట్నం, కాళసముద్రం గ్రామాల్లో జగనన్న పాల వెల్లువ కింద చేపట్టిన ట్రైల్‌రన్‌ను జాయింట్‌ కలెక్టర్‌ సిరితో కలసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. అనంతరం మీడియాతో కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని కదిరి క్లస్టర్‌ పరిధిలో నాలుగు మండ లాల్లో పాల సేకరణ ప్రారంభించడం జరిగింద న్నారు. జనవరి 10 వ తేది నుంచి నాలుగు మండలాల పరిధిలోని గ్రామాల్లో మహిళా పాడి రైతుల నుంచి పాల సేకరణ జరుగుతోందన్నారు. మొదట పదిరోజులు గడిచిన అనంతరం పాలు పోసిన రైతులకు డబ్బులు కూడా చెల్లించడం జరిగిం దన్నారు. శుక్రవారం ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానం ద్వారా జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభిం చడం జరుగుతుందన్నారు. పాలవెల్లువ కార్యక్రమాన్ని అమూల్‌ సంస్థతో సమన్వ యం చేసుకుని కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అంతకు మునుపు కాళసముద్రం బాలయోగి గురుకుల పాఠశాలను కలెక్టర్‌ పరిశీలించా రు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటరెడ్డి, తహసీల్దార్‌ నట్‌రాజ్‌, ఎంపీడీఓ రమేష్‌బాబు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-28T06:15:49+05:30 IST