Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళల ఆర్థిక స్వావలంబనకు పాలవెల్లువ దోహదం

 కలెక్టర్‌ నివాస్‌

పామర్రు, డిసెంబరు 3 : మహిళల ఆర్థిక పురోభివృద్ధి సాధనకు ప్రభుత్వ అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ పథకం ఎంతోగానో దోహద పడుతుందని కలెక్టర్‌ నివాస్‌ అన్నారు. జుఝ్జవరం సచివాలయం వద్ద శుక్రవారం పాల వెల్లువ, ఓటీఎస్‌లపై  జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు.  మహిళాలే సంఘాలుగా ఏర్పాడి పాలసేకరణ చేసి డెయిరీకి పంపుకోవచ్చునన్నారు. జిల్లాలో 303 గ్రామాల్లో  అపథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. అమ్యూల్‌ పాలడెయిరీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సంపూర్ణ గృహ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రయోజనాలను వివరించారు. గోనే సంచులు ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచమన్నారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి ప్రభుత్వ పథకాల అమలుతీరును సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. మండల ప్రత్యేకాధికారి నారాయణ, ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్‌, సర్పంచ్‌ పుట్టి పున్నమ్మ, ఎంపీడీవో రామకృష్ణ, తహసీల్దార్‌ నూతక్కి సురేష్‌బాబు, ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి లక్ష్మీ నాంచారమ్మ పాల్గొన్నారు. 


 సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ విస్తృత తనిఖీలు

తోట్లవల్లూరు : అధికారులందరూ బాధ్యతతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని సబ్‌ కలెక్టర్‌ సాయిసూర్య ప్రవీణ్‌చంద్‌ సూచించారు. తోట్లవల్లూరు, రొయ్యూరు, పెనమకూరు, గరికపర్రు గ్రామాల్లో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఓటీఎస్‌ లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలను, గ్రామ సచివాలయాలను, అంగన్‌వాడీ కేంద్రాలను, మధ్యాహ్న భోజనాన్ని, పీహెచ్‌సీ సబ్‌ సెంటర్‌లను సబ్‌ కలెక్టర్‌ సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పెనమకూరు హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోంచేశారు. రొయ్యూరులో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని 18 మందికి వైద్య సిబ్బందితో వెంటనే వ్యాక్సిన్‌ చేయించారు. Advertisement
Advertisement